Saturday, May 18, 2024
HomeMovie Newsవిజయ్ దేవరకొండ తో దిల్ రాజు మరో మూవీ..డైరెక్టర్ ఎవరంటే

విజయ్ దేవరకొండ తో దిల్ రాజు మరో మూవీ..డైరెక్టర్ ఎవరంటే

- Advertisement -

పెళ్లి చూపులు , గీత గోవిందం, అర్జున్ రెడ్డి మూవీస్ తో హ్యాట్రిక్ విజయాలు సాధించి యూత్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ..ఆ తరువాత నుండి వరుస ప్లాప్స్ చవిచూస్తున్నాడు. భారీ అంచనాల నడుమ వచ్చిన చిత్రాలని బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్స్ అవుతున్నాయి. రీసెంట్ గా పరుశురాం డైరెక్షన్లో ‘ఫ్యామిలీ స్టార్ ‘ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దిల్ రాజు నిర్మాత అవ్వడం , మృణాల్ ఠాకూర్ హీరోయిన్ కావడం.గీత గోవిందం డైరెక్టర్ పరుశురాం మరోసారి విజయ్ తో సినిమా చేయడంతో అందరిలో ఈ మూవీ ఫై అంచనాలు పెట్టుకున్నారు.

కానీ ఈ మూవీ మొదటి రోజు మొదటి ఆట తోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకొని నిర్మాత కు భారీ నష్టాలూ తెచ్చిపెట్టింది. ప్రస్తుతం విజయ్ ఆశలన్నీ గౌతమ్ తిన్ననూరి మూవీ పైనే ఉన్నాయి. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా సెట్స్ ఫై ఉండగానే మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రవి కిరణ్ కోలా అనే యంగ్ డైరెక్టర్‌తో విజయ్ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను ప్రకటించారు. దిల్ రాజు, విజయ్ దేవరకొండ, రవి కిరణ్ కోలా కలిసి ఉన్న ఫొటోను సైతం షేర్ చేసారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ నుంచి 59వ చిత్రంగా రాబోతున్న ఇది ‘రూరల్ యాక్షన్ డ్రామా’గా తెరకెక్కబోతుందని కూడా చిత్ర యూనిట్ తెలిపింది. ఇందులో విజయ్ దేవరకొండలోని డిఫరెంట్‌ మాస్‌ను చూపించబోతున్నట్లు వెల్లడించారు. ఇక, ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలను మే 9వ తేదీన చెప్పబోతున్నట్లు మూవీ యూనిట్ తాజా పోస్టులో పేర్కొంది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read