Tuesday, June 18, 2024
HomeMovie Newsకల్కి నుంచి సడన్ సర్ప్రైజ్ ..ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

కల్కి నుంచి సడన్ సర్ప్రైజ్ ..ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

- Advertisement -

కల్కి నుంచి సడన్ సర్ప్రైజ్ ..అభిమానులను సంతోష పరిచింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దిశా పటాని, దీపికా పదుకొనె జంటగా మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న మూవీ ‘కల్కి 2898 ఏడీ’. విశ్వ నటుడు కమల్‌ హాసన్‌, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి, సస్వత ఛటర్జీ, పశుపతి, గౌరవ్ చోప్రా, మండవ సాయి కుమార్ వంటి వాళ్లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయి లో ఉన్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్‌ భైరవ అనే పాత్రలో నటిస్తుండగా.. అశ్వత్థామగా అమితాబ్‌, కాళీగా క‌మ‌ల్‌హాస‌న్ నటిస్తున్నారు. కెరీయర్‌లోనే తొలిసారిగా కమల్‌ హాసన్‌ విలన్‌గా నటిస్తుండడం విశేషం. ఇప్పటికే విడుదలైన టీజర్ , ఫస్ట్ లుక్ వంటివి సినిమాను ఎప్పుడెప్పుడు చూడాలా..అనే ఆత్రుత పెంచాయి.

మే 15వ తారీఖున సంతోష్ నారాయణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్ . ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . హ్యాపీ బర్త్డ డే సంతోష్ నారాయణ అనే ట్యాగ్ తో ఈ మూవీ నుంచి సరికొత్త పోస్టర్ రిలీజ్ అయింది. ఈ పోస్టర్ చూడడానికి చాలా ఆకట్టుకునే విధంగా ఉంది . అంతేకాదు ఒక్కొక్క క్యారెక్టర్ చాలా స్పెషల్ గా డిజైన్ చేశాడు నాగ్ అశ్వీన్ అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు జనాలు. చూద్దాం మరి ఈ సినిమా ఎలాంటి హ్యూజ్ హిట్ అందుకుంటుందో.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read