Saturday, July 27, 2024
HomeMovie Newsసెగలు రేపుతున్న దీప్తి సునైనా..

సెగలు రేపుతున్న దీప్తి సునైనా..

- Advertisement -

దీప్తి సునైనా..ఈ పేరు వింటే చాలు యూత్ లో ఎక్కడాలేని కిక్ వస్తుంటుంది. మాములుగా హీరోయిన్లకు యూత్ ఫాలోయింగ్ ఉంటుంది కానీ దీప్తి కి హీరోయిన్ కు మించి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యూట్యూబ్ కవర్ సాంగ్స్ తో సూపర్ పాపులర్ అయిన దీప్తి సునైనా బిగ్ బాస్ సీజన్ 2 లో కూడా వెళ్లింది. ఆ సీజన్ లో తనీష్ తో మంచి ఫ్రెండ్ షిప్ మెయిన్ టైన్ చేసిన దీప్తి సునైనా బయటకు వచ్చాక లైట్ తీసుకుంది. ఇక మరో యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ తో దీప్తి సునైనా ప్రేమాయణం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కొన్ని కారణాలతో వారిద్దరూ విడిపోయారు. కొద్దీ రోజులుగా సోషల్ మీడియా కు దూరంగా ఉన్న ఈ భామ..మళ్లీ సోషల్ మీడియా లో యాక్టివ్ అవుతూ వస్తుంది. అంతే కాదు తనలోని హాట్ యాంగిల్ ను కూడా బయటకు తీయడం మొదలుపెట్టింది.

తాజాగా తన సోషల్ మీడియాలో ఒక డార్క్ ఫోటో షూట్ తో సర్ ప్రైజ్ చేసింది. బ్లాక్ స్లీవ్ లెస్ గౌనుతో షాడో గ్లామర్ ట్రీట్ అందిస్తూ సర్ ప్రైజ్ చేసింది. అమ్మడు ఇలా స్లీవ్ లెస్ లో కనిపించడం బహుశా మొదటిసారి అని చెప్పొచ్చు. గ్లామర్ షో చేయాలా వద్దా అనుకుంటూ దాగుడు మూతలు ఆడుతున్నట్టుగా కనిపిస్తుంది. దీప్తి ఈ ఫోటో షూట్ షేర్ చేస్తూ వై దిస్ కొలవెరి డి అని కామెంట్ పెట్టింది. అంటే ఈ రేంజ్ లో రెచ్చిపోవడం ఏంటని నెటిజన్లు తన గురించి మాట్లాడుకుంటారని ముందే కనిపెట్టి మరి అమ్మడు ఈ పిక్స్ షేర్ చేసిందన్నమాట. ఏది ఏమైనా దీప్తి ఈ రేంజ్ గ్లామర్ షో చేయడం అందర్నీ ఆశ్చర్యం తో పాటు కిక్ ఇస్తుంది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read