No menu items!
Tuesday, May 21, 2024
No menu items!
HomeMovie Newsబన్నీ సపోర్ట్ తో పవన్ అభిమానులు ఫుల్ హ్యాపీ

బన్నీ సపోర్ట్ తో పవన్ అభిమానులు ఫుల్ హ్యాపీ

- Advertisement -

ఏపీలో ఎన్నికల ప్రచారానికి తెరపడే సమయం వచ్చింది. రేపటితో ఎన్నికల ప్రచారానికి ముంగిపు రాబోతుంది. మే 13 న ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో ఉన్న ఈ కొద్దీ సమయంలో అభ్యర్థులు , పార్టీల అధినేతలే కాదు..సినీస్టార్స్ కూడా పెద్ద సంఖ్యలో ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఈసారి ఎన్నికల్లో సినీ తారలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం పెద్దగా ఎవరు రాని సినీ ప్రముఖులు..ఈసారి మాత్రం మీమున్నాం అంటూ ప్రతి ఒక్కరు రంగంలోకి దిగుతున్నారు. కొంతమంది నేరుగా ప్రచారం చేస్తుండగా..మరికొందరు సోషల్ మీడియా ద్వారా తమ సపోర్ట్ ను తెలియజేస్తున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ పలకగా..హీరో నాని , రాజ్ తరుణ్, త్రివిక్రమ్, నిర్మాత నాగ వంశీ మొదలగు ప్రముఖులు తమ మద్దతును తెలిపారు. తాజాగా అల్లు అర్జున్ కు పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపి పవన్ అభిమానుల్లో సంతోషం నింపారు.

ఎన్నికల ప్రయాణంలో పవన్ కల్యాణ్ ఎదుర్కోబోతున్న యుద్ధానికి గాను తన తరఫును హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పాడు అల్లు అర్జున్. అలాగే పవన్ కల్యాణ్ తన జీవితాన్ని సేవకే అంకితం చేస్తూ ఆయన ఎంచుకున్న మార్గం గురించి తాను ఎప్పుడూ గర్వపడుతూనే ఉంటానని చెప్పుకొచ్చాడు. అలాగే కుటుంబ సభ్యుడిగా, తన సపోర్ట్, ప్రేమ ఎప్పుడూ పవన్ కల్యాణ్ కు ఉంటుందని వివరించాడు. మీరు కోరుకున్నవి అన్నీ జరగాలని ఆశిస్తున్నానంటూ ఎక్స్ వేదికగా వెల్లడించాడు.

ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పిఠాపురం శాసనసభ నుంచి పోటీ చేస్తుండగా.. అక్కడ మరింత వేడి రాజుకుంది. అనేక మంది సెలబ్రిటీలు అక్కడే ప్రచారం చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీకి చెందిన అనేక మంది రోజూ కనిపిస్తూ రచ్చ చేస్తున్నారు. ఇలా పవన్ కల్యాణ్ పై తమకు ఉన్న అభిమానాన్ని చూపిస్తున్నారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read