Saturday, November 2, 2024
Homeతెలుగు వార్తలుఆస్కార్ ఎంట్రీ లిస్టులో డియ‌ర్ కామ్రేడ్‌

ఆస్కార్ ఎంట్రీ లిస్టులో డియ‌ర్ కామ్రేడ్‌

క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన చిత్రం డియ‌ర్ కామ్రేడ్‌. ఈ సినిమాను ఫిలిమ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా క‌మిటీ ఆస్కార్ ఎంట్రీ లిస్టులోకి అధికారికంగా ఎంపికైంది. ఫిలిం ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ చిత్రంతో పాటు మ‌రో 28 చిత్రాల‌ను ఈ లిస్టులోకి ఎంపిక‌య్యాయి. ఈ చిత్రాల‌న్నింటినీ స్క్రీనింగ్ చేసే వాటిలో మంచి చిత్రాన్ని ఎంపిక చేసి ఓ చిత్రాన్ని బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ కేట‌గిరీలో ఆస్కార్‌కి పంపుతారు.

డియ‌ర్ కామ్రేడ్‌ మాత్ర‌మే ఈ లిస్టులోకి ఎన్నికైన ఏకైక తెలుగు చిత్రం. ప్ర‌స్తుతం స్క్రీనింగ్ జ‌రుగుతుంది. వీటిలో బెస్ట్ మూవీని ప్ర‌క‌టిస్తారు. ప్ర‌ముఖ ఫిలిం మేక‌ర్ అప‌ర్ణ సేన్ అధ్య‌క్ష‌త‌న ఈ జ్యూరీ ప‌ని చేస్తుంది. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీమూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ బ్యాన‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read