Tuesday, December 3, 2024
Homeతెలుగు వార్తలునెపం ఒకరిపై వెయ్యను ప్రయత్నం ఎన్నడూ వీడను!!

నెపం ఒకరిపై వెయ్యను ప్రయత్నం ఎన్నడూ వీడను!!

విజయమే లక్ష్యంగా
శ్రమే ఆయుధంగా….
ముందుకు సాగుతున్న
వర్ధమాన యువ నటుడు జయదేవ్

- Advertisement -

“స్వీయలోపంబెరుగుట పెద్ద విద్య” అన్న ఆర్యోక్తికి బ్రతికున్నంత కాలం అక్కినేని నాగేశ్వరావు ‘బ్రాండ్ అంబాసడర్’గా ఉండేవారు. ఎన్ఠీఆర్, ఎస్వీఆర్ వంటి ధీశాలులను ఢీకొని నెగ్గుకురావడం కోసం తన బలాలు, బలహీనతలను బేరీజు వేసుకుని ముందుకు సాగేవాడినని ఆయన తరచూ గుర్తు చేసుకునేవారు. వర్ధమాన యువ నటుడు జయదేవ్ కూడా తన లోపాలు తానే సరి చేసుకుంటూ… తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక చిన్న ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం కోసం అహరహం శ్రమిస్తున్నానని అంటున్నాడు. “ఆ లోపం… ఆడిషన్ పరమైనది, లేదా ప్రయత్నం పరమైనది కావొచ్చు… లేదా అప్రోచ్ పరమైనది కావొచ్చు. నాకంటే తర్వాత వచ్చినవాళ్ళు రేసులో దూసుకుపోతుంటే… నేను ఇంకా “స్టగులర్”గానే ఉండదానికి కచ్చితంగా నాదే లోపంగా భావిస్తాను” అంటున్నాడు!!

సంచలన దర్శకుడు తేజ కొత్తవాళ్ళతో ఒక సినిమా తలపెట్టి చేసిన “స్టార్ హంట్”లో విజేతగా నిలిచాడు జయదేవ్. అప్పటికి అతడు నూనూగు మీసాల నవ యువకుడు. జస్ట్ 17.. అతడి వయసు. కొన్ని రోజులు వర్క్ షాప్ కూడా చేశారు. కానీ.. కారణాంతరాల వల్ల సదరు ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అయినా జయదేవ్ కుంగిపోలేదు. “చావో రేవో” తేల్చుకోవాల్సిందేనని ఫిక్స్ అయిపోయి… ప్రయివేటుగా చదువును కొనసాగిస్తూనే… పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు ప్రారంభించాడు.
ప్రభాస్ “మిర్చి”, రామ్ “ఎందుకంటే ప్రేమంట” తదితర చిత్రాల్లో నటించే అవకాశాలు దక్కించుకుని… తన తల్లిదండ్రులు, తన సోదరుడు తన మీద ఉంచిన నమ్మకాన్ని నిజం చేశాడు!!

“యుద్ధం శరణం” చిత్రంలో నాగ చైతన్య స్నేహితునిగా నటించే ఛాన్స్ సొంతం చేసుకున్న ఈ యువతేజం… ఆ చిత్రంతో మొదటిసారిగా “పోస్టర్” ఎక్కాడు. “ప్రేమిక” అనే షార్ట్ ఫిల్మ్ కోసం సైమా అవార్డ్ కు నామినేట్ అయ్యాడు. “ఆహా”లో స్ట్రీమింగ్ అవుతున్న అర్ధమైందా “అరుణ్ కుమార్”లో విలన్ గా నటించి మెప్పించిన జయదేవ్… మెల్లగా అందరి దృష్టిని ఆకర్షించడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం “వార్ మెన్” వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ చేస్తున్న జయదేవ్… కృష్ణ మామిడి దర్శకత్వంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న “ఆద్య”లో విలన్ గా నటిస్తున్నాడు!!

శేఖర్ మాస్టర్ దగ్గర డాన్స్ సాధన చేసిన జయదేవ్… మార్షల్ ఆర్ట్స్ లోనూ తగిన తర్ఫీదు పొందాడు. కెరీర్ బిగినింగ్ లో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చేరి శిక్షణ తీసుకున్న ఈ కుర్రాడు… “అద్దం” తన అసలు సిసలు గురువంటాడు. నటనను అర్ధం చేసుకోవడానికి అద్దం తనకు ఎంతగానో దోహదపడుతుందని చెబుతాడు. “నన్ను నాకంటే మిన్నగా నమ్మిన మా నాన్న, అమ్మ, నాన్నల నుంచి ఇప్పటివరకు తీసుకోవడం తప్ప… వాళ్లకు ఇచ్చిందన్నదే లేదు” అంటూ ఒకింత భావోద్వేగానికి లోనయ్యే ఈ వాస్తవవాది… తన “అమ్మానాన్న, అన్న” తనను చూసి గర్వపడేలా చేయడమే తన ముందున్న ధ్యేయంగా ప్రకటించుకుంటాడు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read