Saturday, April 27, 2024
HomeTop Storiesభారతీయన్స్ రివ్యూ.. only for Bharath

భారతీయన్స్ రివ్యూ.. only for Bharath

డైరెక్టర్: దీనరాజ్
నిర్మాతలు: శంకర్ నాయుడు అడుసుమిల్లి
మ్యూజిక్ డైరెక్టర్ : సత్య కశ్యప్, కపిల్ కుమార్
సినిమాటోగ్రఫీ: జయపాల్ రెడ్డి నిమ్మల

- Advertisement -

దీనరాజ్ దర్శకత్వంలో రూపొందిన “భారతీయన్స్” సినిమా దేశభక్తి కథ నేపథ్యంలో రూపొందింది. రచయితగా ఉన్న దీన రాజ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇందులో కొత్తతరం నటీనటులు నీరోజ్ పుచ్చా, సుభారంజన్, సోనమ్ టెండప్, సమైరా సందు, పెడెన్ నాంగ్యాల్, రాజేశ్వరి చక్రవర్తి, మహేందర్ బర్కాస్ తదితరులు నటించారు. ఈ సినిమాను భారత్ అమెరికన్ క్రియేషన్స్ బ్యానర్ పై డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి నిర్మించారు. సత్య కశ్యప్, కపిల్ కుమార్ సంగీతం ఇవ్వగా జైపాల్ రెడ్డి నిమ్మల సినిమాటోగ్రాఫర్ గా చేశారు. ఇది పాన్ ఇండియా సినిమా తెలుగు, హిందీ భాషల్లో ఈ రోజు విడుదల అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్వరలో తమిళ్ , మలయాళం మరియు కన్నడ భాషలలో రానున్నది.

story :ఈ సినిమా భారత దేశంలోని ఆరు ప్రాంతాలకు చెందిన ఆరుగురు వ్యక్తుల చుట్టూ ఉంటుంది. ఈ ఆరుగురిలో ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు ఉంటారు. అలా వాళ్ళు తెలుగు, భోజ్ పురి, నేపాలి, పంజాబీ, బెంగాలీ, త్రిపురకు చెందినవాళ్లు. ఇక ఈ ఆరుగురికి దేశభక్తి అంటే చాలా ఎక్కువ. అయితే ఓసారి ఈ ఆరుగురిని కొన్ని వేరువేరు సమస్యలు వెంటాడుతాయి. ఇక ఆ సమస్యల నుండి బయటపడడానికి ప్రయత్నిస్తున్న సమయంలో వారికి కొందరి అజ్ఞాత వ్యక్తుల నుంచి పిలుపు వస్తుంది. అలా వీరు ఆ అజ్ణాత వ్యక్తుల మాటలు వింటారా.. ఇంతకు ఆ సీక్రెట్ మిషన్ ఏంటి.. ఆరుగురికి చుట్టుముట్టిన సమస్యలు ఏంటి.. చివరికి వీళ్లంతా అజ్ఞాత వ్యక్తులు చెప్పిన సీక్రెట్ మిషన్ ను సక్సెస్ చేస్తారా లేదా అనేది మిగిలిన కథలోనిది.

Plus : కొన్ని సన్నివేశాలు, ఎమోషన్స్.
Minus: నటీనటులు పర్ఫామెన్స్ , పరిచయం లేను నటులు

చివరగా ఈ సినిమా తమకున్న దేశభక్తి ఆ ఆరుగురు వ్యక్తులు ఎలా చూపించారో అనేది ప్రతి ఒక్కరిని కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ సినిమా చూడాల్సిందే.

రేటింగ్: 3.25

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read