Wednesday, July 24, 2024
Homeతెలుగు వార్తలునవంబర్ 10న రాబోతున్న ‘అలా నిన్ను చేరి’

నవంబర్ 10న రాబోతున్న ‘అలా నిన్ను చేరి’

దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ఫీల్ గుడ్ ప్రేమ కథా చిత్రం ‘అలా నిన్ను చేరి’. ఈ మూవీని విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పిస్తున్నారు. అన్ని రకాల అంశాలను జోడించి ఈ మూవీని మారేష్ శివన్ తెరకెక్కించగా కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించారు. ఆస్కార్ గ్రహీత చంద్రబోస్ పాటలు రాయగా.. సుభాష్ ఆనంద్ సంగీతాన్ని అందించారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఈ చిత్రానికి ఆండ్రూ కెమెరామెన్.. కింగ్ సోలమన్, రామ కిషన్ యాక్షన్ కొరయోగ్రాఫర్స్. నవంబర్ 10న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు సాయి రాజేష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

- Advertisement -

సాయి రాజేష్ మాట్లాడుతూ.. ‘సాయి సుధాకర్, శ్రీధర్ వంటి నిర్మాత దొరకడం డైరెక్టర్ మారేష్‌ అదృష్టం. మొదటి సినిమాకే ఇంత మంచి టీం దొరికింది. దినేష్ చాలా మంచి వ్యక్తి. మంచి నటుడు. అతనికి సరైన బ్రేక్ రావాలి. బేబితో మా జీవితాలు మారిపోయాయి. ఈ చిత్రంతో దినేష్ లైఫ్ మారిపోవాలి. పాయల్ గారు తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు. ఆర్జీవీకి శ్రీదేవి ఎలానో నేను హెబ్బా పటేల్‌కు పెద్ద ఫ్యాన్‌‌ని. ఈ మూవీ టీజర్, ట్రైలర్, మ్యూజిక్ అందరినీ ఆకట్టుకున్నాయి. నవంబర్ 10న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

నిర్మాత కొమ్మాలపాటి సాయి సుధాకర్ మాట్లాడుతూ.. ‘ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన సాయి రాజేష్ గారికి థాంక్స్. అలా నిన్ను చేరి సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. మా నాన్న గారే ఈ కథను ఎంచుకున్నారు. ఆ తరువాత నేను కూడా కథలోకి ఇన్వాల్వ్ అయ్యాను. ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అయ్యే కథ. ప్రతీ ఒక్కరి జీవితంలో జరిగే కథ. లక్ష్యం, ప్రేమ మధ్య జరిగే సంఘర్షణే ఈ చిత్రం. మా డైరెక్టర్ ఈ కథతో పాటే జీవించాడు. ఎంతో ప్యాషన్ ఉన్న దర్శకుడు. మంచి అవుట్ పుట్ వచ్చింది. ప్రేక్షకులు మా సినిమాను చూసి విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. దినేష్ ఎంతో సహజంగా నటిస్తాడు. పక్కింటి అబ్బాయిలానే అనిపిస్తాడు. పాయల్‌కు ఇదే తొలి థియేట్రికల్ మూవీ. ఇంతకు ముందు వెబ్ సిరీస్‌లు చేసింది. ఈ సినిమాకు హెబ్బా పటేల్ మెయిన్ ఎసెట్. సినిమాను భుజాల మీద మోసింది. సుభాష్ మ్యూజిక్, ఆర్ఆర్ అద్భుతంగా ఇచ్చాడు. ఆండ్రూ గారు మాకు దొరకడం అదృష్టం. చంద్రబోస్ గారు రాసిన ఆరు పాటలు, ఓ బిట్ అద్భుతంగా ఉంటాయి. కింగ్ సోలమన్, ఆర్కే గారి యాక్షన్ సీక్వెన్స్ బాగుంటాయి. సినిమాలో పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

కొమ్మాలపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. ‘సాయి సుధాకర్‌కు ఇది మొదటి చిత్రం. ఈ మూవీని చూశాను. అందరూ అద్భుతంగా చేశారు. టీంకు మంచి పేరు వస్తుంది. దినేష్ నటన హార్ట్‌కు టచ్ అవుతుంది. ఇది మంచి ఫీల్ గుడ్ మూవీ. కథ విన్నప్పుడే అందరికీ మంచి పేరు వస్తుందని నమ్మాను. అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

సుృజన మాట్లాడుతూ.. ‘మా నాన్న కళారంగాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. మారేష్ గారు నాకు నాలుగు గంటలు ఫస్ట్ హాఫ్ నెరేట్ చేశాడు. ఎలా తీయాలో ఆయనకు తెలుసు. మంచి టీంను తీసుకుంటున్నామని ఆ తరువాత నా బ్రదర్ సాయి చెప్పారు. టీంకు ఆల్ ది బెస్ట్’ తెలిపారు.

డైరెక్టర్ మారేష్ శివన్ మాట్లాడుతూ.. ‘కొమ్మాలపాటి శ్రీధర్ గారి వల్లే నేను ఇక్కడ ఉన్నాను. ఎంత బిజీగా ఉన్నా కూడా ఆయన కథ విన్నారు. ఆయనకు సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. ఆస్కార్ అవార్డ్ గ్రహీత చంద్రబోస్ గారు ఈ చిత్రానికి అన్ని పాటలు రాశారు. నేషనల్ అవార్డ్ గ్రహీత కింగ్ సోలమన్ గారు ఫైట్స్ కంపోజ్ చేశారు. సుభాష్ ఆనంద్ ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టాడు. నిర్మాత సాయి సుధాకర్ గారికి ఎంతో ప్యాషన్ ఉంది. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. హుషారు తరువాత ఈ కథను చెప్పాను. ఆ తరువాత ఎంతో మందికి చెప్పాను. చివరకు దినేష్ వద్దకే వెళ్లింది. ఎంతో సహజంగా నటించాడు. హెబ్బా పటేల్ ఈ మూవీ సెకండాఫ్‌ను భుజాల మీద మోసింది. ఎంతో మెచ్యూర్డ్ రోల్‌ను పోషించింది. పాయల్ ఫస్ట్ హాఫ్‌లో ఉంటుంది. లవ్, కెరీర్ మధ్య జరిగే సంఘర్షణే ఈ మూవీ. ప్రేమను ఎంచుకోవాలా? కెరీర్‌ను ఎంచుకోవాలా? రెండూ ఎంచుకోవాలా? అన్నదే ఈ కథ. ఎమోషనల్‌గా వెంటాడుతుంది. థియేటర్ల నుంచి బయటకు వచ్చాక కూడా అదే ట్రాన్స్‌లో ఉంటారు. కన్నీళ్లతో బయటకు వస్తారు. ఈవెంట్‌కు గెస్టుగా వచ్చిన సాయి రాజేష్ గారికి థాంక్స్. ప్రతీ సీన్‌లో నా భార్య నాకు సహకరించింది. ఈ చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నవంబర్ 10న మా చిత్రం రాబోతోంది. అందరూ థియేటర్లోనే సినిమాను చూడండి’ అని అన్నారు.

దినేష్ తేజ్ మాట్లాడుతూ.. ‘హుషారు చిత్రానికి మారేష్ శివన్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఆయనకు సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. ఆయన కోసమైనా సరే ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలి. సాయి సుధాకర్, శ్రీధర్‌ గార్ల ఫ్యామిలీ ఎప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తుంది. కొత్త నిర్మాతలైనా కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. బెస్ట్ టీంను ఇచ్చారు. ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే చిత్రాలనే చేయాలని ప్రయత్నిస్తాను. ఈ మూవీ కూడా అందరికీ కనెక్ట్ అవుతుంది. హెబ్బా ఆల్రెడీ పెద్ద స్టార్. పాయల్, హెబ్బాలు ఇద్దరూ అద్భుతంగా నటించారు. కెరీర్ ప్రారంభంలో అందరూ నా బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అని అడిగేవారు. నా దర్శక నిర్మాతలే నా బ్యాక్ గ్రౌండ్. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులే నా బ్యాక్ గ్రౌండ్. మన టైం త్వరలోనే వస్తుంది. నవంబర్ 10న మా చిత్రం రాబోతోంది. ఏ ఒక్కరినీ కూడా నిరాశపర్చదు’ అని అన్నారు.

హెబ్బా పటేల్ మాట్లాడుతూ.. ‘ఈవెంట్‌కు గెస్టుగా వచ్చిన సాయి రాజేష్ గారికి థాంక్స్. నాకు మంచి పాత్రను ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. మా సినిమా నవంబర్ 10న రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.

పాయల్ రాధకృష్ణ మాట్లాడుతూ.. ‘ట్రైలర్‌ను యూట్యూబ్‌లో చూశాను. ఇంకా చిత్రాన్ని చూడలేదు. అందరితో పాటు థియేటర్లోనే చూస్తాను. తెలుగులో ఇది నాకు మొదటి సినిమా. తెలుగు కూడా నేర్చుకుంటున్నాను. ఈ టీంతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

కెమెరామెన్ ఆండ్రూ మాట్లాడుతూ.. ‘కొత్త దర్శకుడైన మారేష్‌ను నమ్మి ఇంత మంచి కథను తెరకెక్కించిన నిర్మాత గట్స్‌కు హ్యాట్సాఫ్. నేను చేసిన ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్, ఎందుకంటే ప్రేమంట, గుండెజారి గల్లంతయిందే వంటి సినిమాల సరసన ఈ చిత్రం ఉంటుంది’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్ మాట్లాడుతూ.. ‘అన్ని రకాల అంశాలున్న కమర్షియల్ సినిమా దొరకడం చాలా అరుదు. మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడికి థాంక్స్. హెబ్బా పటేల్‌తో ఇది నాకు మూడో సినిమా. పాటలు వినండి.. సినిమా చూడండి.. అందరికీ నచ్చుతుంది. మీ గుండెల్లో ఉండిపోతుంది. ప్రతీ ఒక్కరి జీవితంలో జరిగే కథ ఇది. చంద్రబోస్ గారి సాహిత్యం బాగుంటుంది’ అని అన్నారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read