Friday, March 29, 2024
Homeతెలుగు వార్తలుపతాక సన్నివేశాల చిత్రీకరణలో శ్రీరాజ్ బళ్ళా "నరసింహపురం"

పతాక సన్నివేశాల చిత్రీకరణలో శ్రీరాజ్ బళ్ళా “నరసింహపురం”

బహుముఖ ప్రతిభాశాలి శ్రీరాజ్ బళ్ళా దర్శకత్వంలో.. గీత్ గౌరవ్ సినిమాస్ పతాకంపై పి.ఆర్.క్రియేషన్స్ సమర్పణలో ‘శ్రీరాజ్ బళ్ళా-టి.ఫణిరాజ్ గౌడ్- నందకిశోర్ ధూళిపాల’ సయుక్తంగా నిర్మిస్తున్న ఫ్యామిలీ ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘నరసింహపురం’. పలు సీరియల్స్, సినిమాల ద్వారా సుపరిచితుడైన నందకిశోర్ ఈ చిత్రం ద్వారా హీరోగా మారుతున్నారు. సిరి హనుమంతు హీరోయిన్ గా, ఉష చెల్లెలు పాత్రలో నటించారు. వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతూ… అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో అత్యద్భుతంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పతాక సన్నివేశాల చిత్రీకరణలో ఉంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ కి చాలా మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా ‘నరసింహపురం’ టైటిల్ కి మరింత మంచి రెస్పాన్స్ వస్తోంది.

- Advertisement -


చిత్ర దర్శకుడు శ్రీరాజ్ బళ్ళా మాట్లాడుతూ…’తమ్మారెడ్డి భరద్వాజ గారి చేతుల మీదుగా విడుదలైన ‘నరసింహపురం’ ఫస్ట్ లుక్ కి మేమూహించిన దానికంటే మంచి రెస్పాన్స్ వస్తోంది. హీరోగా పరిచయమవుతున్న ప్రముఖ నటుడు నందకిషోర్ కి ‘నరసింహపురం’ చాలా మంచి పేరు తెస్తుంది. అతని ప్రతిభను పూర్తి స్థాయిలో వెలికి తెచ్చే చిత్రమిది. ప్రస్తుతం క్లయిమాక్స్ సీన్స్ షూట్ చేస్తున్నాము. దీంతో షూటింగ్ పూర్తవుతుంది. ఫ్రాంక్లిన్ సుకుమార్ సంగీతం ‘నరసింహపురం’ చిత్రానికి ముఖ్య ఆకర్షణల్లో ఒకటి అవుతుంది” అన్నారు.

కల్యాణ మాధవి, లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫేమ్ విజయ్ కుమార్, అరవిందసమేత ఫేమ్ రంగధామ్, రవివర్మ, సంపత్, ఫణిరాజ్, స్వామి, శ్రీకాంత్, శ్రీకర్, శివ, జునైద్’, గిరిధర్, సాయిరాజ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ అప్పాజీ, మేకప్: కె.వి.బాబు, పబ్లిసిటీ డిజైన్స్: వెంకట్.ఎం, విఎఫెక్స్: చందు ఆది, కెమెరా: కర్ణ ప్యారసాని, ఎడిటర్: శివ వై.ప్రసాద్, పాటలు: గడ్డం వీరు, సంగీతం: ఫ్రాంక్లిన్ సుకుమార్, నిర్మాతలు: శ్రీరాజ్ బళ్ళా- టి.ఫణిరాజ్ గౌడ్-నందకిశోర్ ధూళిపాల, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీరాజ్ బళ్ళా!!

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

Tollywood News

Most Read