Friday, May 10, 2024
HomeMovie Newsవామ్మో… ఆ సీన్ చేయడానికి మృణాల్ కు 3 గంటలు పట్టిందట..

వామ్మో… ఆ సీన్ చేయడానికి మృణాల్ కు 3 గంటలు పట్టిందట..

- Advertisement -

మృణాల్ ఠాకూర్..ప్రస్తుతం ఈ పేరు ఇండస్ట్రీ లో బాగా వినిపిస్తుంది. సీతారామం మూవీ తో తెలుగు లో ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది..ఫస్ట్ మూవీ తోనే యూత్ & ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైంది. ఇక నాన్న మూవీ తో మరో సూపర్ హిట్ కొట్టి..అసలైన గ్లామర్ తో యూత్ కు నిద్ర లేకుండా చేసింది. ఈ రెండు సూపర్ హిట్ల తర్వాత విజయ్ దేవరకొండ తో ఫ్యామిలీ స్టార్ మూవీ లో నటించింది. ఈ సినిమా ఫై గప్పెడు ఆశలు పెట్టుకుంది కానీ..ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది.

ఇదిలా ఉంటె తాజాగా ఈమె షాహిద్ కపూర్ తో చేసిన ‘జర్నీ’ మూవీ విశేషాలను పంచుకుంది. తన అభిమాన హీరో షాహిద్ కపూర్ అని..అలాంటి హీరో సినిమాలో నటించే అవకాశం రావడం తో ఎంతో సంబర పడినట్లు తెలిపింది. షాహిద్ షూట్ లో తనని చూసి స్మైల్ చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించేదని తెలిపింది. అయితే..షాహిద్ కపూర్ ను చెంప మీద కొట్టే సీన్ ను మాత్రం మూడు గంటలు చేసానని తెలిపింది. ఈ సినిమాలోని ఒక సీన్లో హీరోయిన్.. హీరోను చెంప మీద కొడుతుంది. అయితే, ఆ సీన్ తను నటించనని మొండికేసిందట మృణాల్. షాహిద్ కపూర్ ను కొట్టలేను అని చేయను అని చెప్పిందట. చివరికి కన్విన్స్ చేయడంతో ఆమె ఆ సీన్ చేసేందుకు ఒప్పుకుందట. ప్రస్తుతం మృణాల్ హిందీలో వరుస సినిమాలు చేస్తుంది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read