Friday, May 10, 2024
HomeMovie News‘కల్కి 2898 ఏడీ’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసిందోచ్

‘కల్కి 2898 ఏడీ’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసిందోచ్

- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దిశా పటాని, దీపికా పదుకొనె జంటగా మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న మూవీ ‘కల్కి 2898 ఏడీ’. విశ్వ నటుడు కమల్‌ హాసన్‌, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి, సస్వత ఛటర్జీ, పశుపతి, గౌరవ్ చోప్రా, మండవ సాయి కుమార్ వంటి వాళ్లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయి లో ఉన్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్‌ భైరవ అనే పాత్రలో నటిస్తుండగా.. అశ్వత్థామగా అమితాబ్‌, కాళీగా క‌మ‌ల్‌హాస‌న్ నటిస్తున్నారు. కెరీయర్‌లోనే తొలిసారిగా కమల్‌ హాసన్‌ విలన్‌గా నటిస్తుండడం విశేషం. ఇప్పటికే విడుదలైన టీజర్ , ఫస్ట్ లుక్ వంటివి సినిమాను ఎప్పుడెప్పుడు చూడాలా..అనే ఆత్రుత పెంచాయి.

ఈ క్రమంలో ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఎప్పుడు ప్రకటిస్తారా అని ఎదురుచూస్తుండగా ..మేకర్స్ శనివారం ప్రకటించి ఉత్కంఠ కు తెరదించారు. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రభాస్, దీపికా అమితాబ్‌లపై ఓ కేజ్రీ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశారు. తెలుగుతో పాటు హిందీ భాష‌ల్లో ఏక‌కాలంలో ఈ మూవీని షూటింగ్‌ను పూర్తి చేశారు. తమిళ్‌, మలయాళం, కన్నడంతో పాటు ఇంగ్లీష్‌లో డబ్‌ చేసి విడుదల చేయనున్నారు. సలార్‌ తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న చిత్రం కావడంతో ఇండియన్‌ సినిమా రికార్డులన్నీ క‌ల్కి అధిగ‌మించే అవ‌కాశం ఉందని భావిస్తున్నారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read