Saturday, July 27, 2024
Homeతెలుగు వార్తలువి.కె.బి ఆర్ట్స్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 పూజా కార్యక్రమాలతో ప్రారంభం

వి.కె.బి ఆర్ట్స్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 పూజా కార్యక్రమాలతో ప్రారంభం

- Advertisement -

ఆదిత్య ఓం, దిషా హీరో హీరోయిన్లు గా వి.కె.బి ఆర్ట్స్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమా శుక్రవారం (ఆగస్ట్ 9న) ఫిలిం నగర్ సాయిబాబా టెంపుల్ లో ఉదయం 9:45 గంటలకు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. రాధా మోహన్, దామోదర్ ప్రసాద్, శ్రీరంగం సతీష్ కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేయడం జరిగింది. కెమెరా స్విచ్ ఆన్ నిర్మాత దామోదర్ ప్రసాద్ చెయ్యగా, మరో నిర్మాత రాధామోహన్ క్లాప్ కొట్టడం జరిగింది. ఈరోజు నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్ర రెండోసారి షెడ్యూల్ ఆగస్ట్ 19నుండి ప్రారంభం జరగనుంది. ప్రదీప్ రావత్, షియాజి షిండే, ఆశిష్ విద్యార్థి మొదలగు నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. పి.యుగంధర్ రామ్ ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. వి.కుమార్ బాబు నిర్మాతగా వ్యవహారిస్తున్న ఈ చిత్రానికి జే. తులసీ దాస్ సహా నిర్మాత.

సాంకేతిక నిపుణులు

కథ – మాటలు- దర్శకత్వం: పి.యుగంధర్ రామ్
నిర్మాత:వి.కుమార్ బాబు
సహా నిర్మాత: జే. తులసి దాస్
కెమెరా: నగేష్
మ్యూజిక్: జయ సూర్య
డాన్స్ మాస్టర్: కపిల్
ఫైట్స్: వజ్రాలు, పృద్వి శేఖర్
ఎడిటర్: రాజు
ఆర్ట్ డైరెక్టర్: విజయ కృష్ణ
పి.ఆర్.ఓ: మధు వి.ఆర్

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read