Thursday, October 24, 2024
HomeMovie Newsకాంగ్రెస్ కోసం వెంకటేశ్ పెద్ద కూతురు ప్రచారం

కాంగ్రెస్ కోసం వెంకటేశ్ పెద్ద కూతురు ప్రచారం

- Advertisement -

ప్రస్తుతం తెలంగాణలోనూ లోక్ సభ ఎఇందులో న్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మే 13న పోలింగ్ జరగనుండగా.. అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాపెయినర్లను రంగంలోకి దించుతుందంటూ గతకొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఖమ్మం పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ లోక్‌ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామసహాయం రఘురాంరెడ్డి తరుపున హీరో విక్టరీ వెంకటేష్ ప్రచారం చేయబోతున్నట్లు గత వారం రోజులుగా ప్రచారం అవుతూ వస్తున్నాయి.

వెంకీ పెద్ద కూతురు అశ్రిత ను రఘురాంరెడ్డి తనయుడికి ఇచ్చి వివాహం చేసారు. దీంతో తన వియ్యకుడి గెలుపు కోసం వెంకీ ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్నట్లు తెలుస్తుంది. వెంకీ కంటే ముందు అయన కూతురు ప్రచారంలోకి దిగింది. తన మామ, ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామి రెడ్డి తరఫున ప్రచారం చేశారు. ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ ఆత్మీయ సమావేశంలో ఆమె పాల్గొని కేసీఆర్ ఫై విమర్శలు సంధించింది. రఘురామి రెడ్డి గెలిస్తే నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేస్తారనేది వివరించారు.

వెంకటేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలు లేని ఏకైక హీరో అంటే వెంకటేష్ అనే చెపుతుంటారు. సినిమా, క్రికెట్ తప్ప వెంకీ బయటకు కనిపించింది లేదు.. మొదటిసారి వెంకీ రాజకీయ ప్రచారంలో పాల్గొననున్నాడు. మే 07 వెంకీ ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. మరి ఆయన ఎలాంటి విమర్శలు చేస్తారో..వియ్యకుడి కోసం ఏమాట్లాడతారో చూడాలి.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read