Wednesday, July 24, 2024
HomeMovie News'పుష్ప-2' నుంచి లిరికల్ సాంగ్ వచ్చేసింది..దేవి అదరగొట్టాడు

‘పుష్ప-2’ నుంచి లిరికల్ సాంగ్ వచ్చేసింది..దేవి అదరగొట్టాడు

- Advertisement -

మెగా అభిమానులతో పాటు మ్యూజిక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుష్ప-2 నుండి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ వచ్చేసింది. ‘పుష్ప.. పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్..’ అంటూ సాగే ఈ పాట ఓ రేంజ్ లో ఉంది. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ మరోసారి కుమ్మేసాడు. ఈ సాంగ్ తో సినిమా ఫై మరింత అంచనాలు పెరుగుతున్నాయి.

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో చెప్పాలిన పనిలేదు. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. అల్లు అర్జున్ నటనకు ఏకంగా జాతీయ అవార్డు లాభించింది. అంతే కాదు బన్నీ క్రేజ్ ఈ సినిమా తర్వాత బీభత్సంగా పెరిగింది. ఎక్కడ చూసిన అల్లు అర్జున్ పేరే వినిపిస్తుంది.. పుష్ప డైలాగ్సే మారుమ్రోగుతున్నాయి. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతుంది.? కథలో ఎలాంటి ట్విస్ట్ లు ఉంటాయి.? అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే విధంగా సినిమా సాంగ్స్ ఫై కూడా అంతే విధంగా ఎదురుచూస్తున్నారు.

పుష్ప లోని సాంగ్స్ ఇప్పటికే అనేక చోట్ల మారుమోగిపోతున్నాయి. ఈ తరుణంలో బుధువారం పుష్ప 2 లోని ఫస్ట్ సాంగ్ వచ్చి ఆకట్టుకుంది. లిరిసిస్ట్ చంద్రబోస్ రాసిన ఈ పాట అద్భుతంగా ఉంది. పుష్ప 2లో హీరో పాత్ర ఎలా ఉంటుందనే దానిపై ఈ పాటతో ఓ క్లారిటీ వచ్చేసింది. పుష్పలో టైటిల్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అదే రేంజ్‌లో పుష్ప 2 ఫస్ట్ సింగిల్‌ను ప్లాన్ చేశారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ కూడా చాలా క్యాచీగా ఉంది.

బన్నీ, రష్మిక, ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్.. లాంటి స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుందని గతంలోనే ప్రకటించారు. పుష్ప తో నేషనల్ అవార్డు, కోట్ల కలెక్షన్స్, పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్న అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో ఇంకే రేంజ్ కి ఎదుగుతాడో చూడాలి.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read