Thursday, July 25, 2024
HomeMovie Newsపవన్ కోసం రంగంలోకి సుధీర్

పవన్ కోసం రంగంలోకి సుధీర్

- Advertisement -

రెండు తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల సమరం నడుస్తుంది. తెలంగాణ లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుండగా..ఏపీలో అసెంబ్లీ తో పాటు లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి కొనసాగుతుంది. ముఖ్యంగా ఏపీ ఎన్నికల ఫై ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఈసారి ఎవరు ఎన్నికల్లో గెలుస్తారా అనేది తెలుసుకునే పనిలో పడ్డారు. ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తుండడం తో ఇప్పుడు దేశ వ్యాప్తంగా పిఠాపురం పేరు మారుమోగిపోతుంది.

ఈసారి పవన్ కళ్యాణ్ ను గెలుపును ఎవ్వరు ఆపలేరంటూ సర్వేలు చెపుతున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ ను గెలిపించడం కోసం చిత్రసీమ కూడా కదలివస్తుంది. ఇప్పటికే మెగాస్టార్ , అన్నయ్య చిరంజీవి తన మద్దతును తమ్ముడికి ప్రకటించి ప్రజల్లో నమ్మకం పెంచారు. అలాగే వరుణ్ తేజ్ సైతం పిఠాపురంలో ప్రచారం చేసారు. ఇక జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది , రైజింగ్ రాజు , దొరబాబు , గెటప్ శ్రీను తదితరులు గత 15 రోజులుగా విస్తృతంగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు సుడిగాలి సుధీర్ కూడా పవన్ కోసం రంగంలోకి దిగాడు. నిన్నటి నుండి పిఠాపురం నియోజకవర్గం లో పర్యటిస్తూ పవన్ కళ్యాణ్ కు ఓటు వేయాలంటూ కోరుతున్నారు. ఇటు నాగబాబు సతీమణి పద్మజ సైతం మరిది గెలుపు కోసం ఇంటింటికి తిరుగుతూ పవన్ కళ్యాణ్ కు ఓటు వేయాలని కోరుతున్నారు. మొత్తం మీద సినీ తారలంతా పిఠాపురంకు చేరుకుంటుండడంతో అక్కడి ప్రజలు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read