Monday, December 23, 2024
HomeMovie Newsపెళ్లికి ముందే ఇద్దరు పిల్లలకు తల్లి అయిన వరలక్ష్మి

పెళ్లికి ముందే ఇద్దరు పిల్లలకు తల్లి అయిన వరలక్ష్మి

- Advertisement -

వరలక్ష్మి శరత్ కుమార్…మరికొద్ది రోజుల్లో ఓ ఇంటిది కాబోతుంది. అయితే ఈమె పెళ్ళికి ముందే ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యానని చెప్పడం ఇప్పుడు అందర్నీ షాక్ కు గురి చేస్తుంది. తమిళ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ..అక్కడ పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా నటిస్తూ బిజీ గా మారింది. తెలుగు తో పాటు తమిళ్, మలయాళ, కన్నడ సినిమాలోని నటిస్తూ ఫుల్ క్రేజీగా దూసుకుపోతున్న ఈ అమ్మడు..ఇప్పుడు పెళ్లి చేసుకొని సెటిల్ కాబోతుంది.

ఇటీవలే తన ప్రియుడితో ఘనంగా నిశ్చితార్థ వేడుకలు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లికి ముందే వీరిద్దరూ తమ పిల్లల పుట్టిన రోజులు గ్రాండ్ గా జరిపారు. వీళ్ళిద్దరూ పిల్లలు అంటే పిల్లలు కాదు వీరు ప్రాణానికి ప్రాణంగా పెంచుకొని రెండు కుక్కపిల్లలు అని. అయితే ఇటీవల ఈ రెండిటి పుట్టినరోజును ఒకే రోజు క్యూట్ గా సెలబ్రేట్ చేసింది వరలక్ష్మి.

ఈ వేడుకకు తనకు కాబోయే భర్త నికోలయి సచ్‌దేవ్‌ను పిలిచి సందడి చేసింది. మార్చి 25వ తేదీన మూడేళ్లు పూర్తి చేసుకున్న గుక్కి, ఏప్రిల్ 2 న ఏడాది పూర్తి చేసుకున్న జారా లతో ఒకేరోజు కేక్ కట్ చేయించి బర్త్డే సెలబ్రేషన్ ఫొటోస్ తో పాటు ఎమోషనల్ నోట్ షేర్ చేసుకుంది. ఆ రెండు కుక్క పిల్లల రెండు కళ్ళు అంటూ చెప్పుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తన పిల్లల పుట్టినరోజు వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చింది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read