Friday, November 22, 2024
Homeతెలుగు వార్తలు`ఉండి పోరాదే' చిత్రంతో నిర్మాతగా డా.లింగేశ్వ‌ర్ త‌ప్ప‌కుండా మంచి స‌క్సెస్ సాధిస్తారు

`ఉండి పోరాదే’ చిత్రంతో నిర్మాతగా డా.లింగేశ్వ‌ర్ త‌ప్ప‌కుండా మంచి స‌క్సెస్ సాధిస్తారు

గోల్డ్ టైమ్ ఇన్ పిక్చర్స్ పతాకంపై శ్రీమతి సత్య ప్రమీల కర్లపూడి సమర్పణలో డాక్టర్ లింగేశ్వర్ నిర్మాతగా నవీన్ నాయని దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఉండి పోరాదే’. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. డేరింగ్ డైరెక్ట‌ర్ వి. వి వినాయక్ విడుదల చేసిన సాంగ్ కి కూడా సోష‌ల్ మీడియాలో హ్యూజ్ రెస్పాన్స్ రాబ‌డుతుంది. ఈ చిత్ర ట్రైల‌ర్ రిలీజ్ కార్య‌క్ర‌మం ప్ర‌సాద్ ల్యాబ్ లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖ నిర్మాత రాజ్ కందుకూరి ముఖ్య అతిథిగా హాజ‌రై ఉండిపోరాదే ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు. ఈ సందర్భంగా…

- Advertisement -

ప్ర‌ముఖ నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ – ఇక్క‌డ అంతా పాజిటివిటీ ఉంది. అలాగే ఈ స‌నిమా నిర్మాత డా.లింగేశ్వ‌ర్ గారికి చాలా మంచి ఫాలోయింగ్ ఉంది. చాలా మంది ఆయ‌న గైడెన్స్ తీసుకుంటారు. ఒక నిర్మాత‌గా ఆయ‌న 100 ప‌ర్సెంట్ స‌క్సెస్ కొడ‌తారు అనిపిస్తుంది. నేను ట్రైల‌ర్, పాట‌లు చూశాను. టెక్నిక‌ల్‌గా చాలా బాగుంది. గ‌త ఐదు సంవ‌త్స‌రాలుగా చూసుకుంటే చిన్న సినిమాల స‌క్సెస్ రేటు ఎక్కువ ఉంది. క‌థ‌ను న‌మ్మి జెన్యూన్‌గా ఒక మంచి సినిమా తీస్తే ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఏ సినిమాకైనా కంటెంట్ ముఖ్యం. హీరోహీరోయిన్లు చాలా బాగుంది.సాబు వర్గీస్ అధ్బుతమైన మ్యూజిక్ తో పాటు మహావీర్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. లిరిక్స్ కూడా బాగున్నాయి. ఈ సినిమాలో లింగేశ్వ‌ర్ గారు `ఉండిపోరాదే` సాంగ్ ని ఆయ‌నే రాశారు. ఈ సినిమాకు ఎప్పుడు ఎలాంటి అవ‌స‌రం వ‌చ్చినా త‌ప్ప‌కుండా నా స‌పోర్ట్ ఉంటుందిఅన్నారు.

నిర్మాత డా. కె లింగేశ్వర్ మాట్లాడుతూ – ” మా చిత్ర టీజర్ కి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు ట్రైల‌ర్‌కి మ‌రింత మంచి రెస్పాన్స్ వ‌స్తుంద‌ని న‌మ్ముతున్నాను. నేను గ‌తంలో చెప్పిన‌ట్టు సినిమా 100ప‌ర్సెంట్ స‌క్సెస్ అవుతుంది. అందుక‌నే ఈ సినిమా డిస్ట్రిబ్యూష‌న్ ఎవ‌రికీ ఇవ్వ‌లేదు.. నేనే ఓన్ చేయాలి అనే ఆలోచ‌న‌లో ఉన్నాను. ఈ సినిమాలో అంద‌రూ కొత్త‌వారే..అయినా అంత ధైర్యం ఎందుకంటే అది క‌థ‌. సినిమా క‌థ‌ను నేను అంత‌లా న‌మ్మాను. లాస్ట్ 20 మినిట్స్ లో మన ప‌క్క‌న ఉన్న‌వారిని కూడా మ‌ర్చి పోయేలా సినిమా ఉంటుంది. మ‌న ఇంట్లో వారు ఎలా ఉంటారు. వారి బందాలు మ‌న జీవితంలో ఎలాంటి ప్ర‌భావం చూపిస్తాయి అనే అద్భుత‌మైన క‌థాంశంలో తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు న‌వీన్. ప్ర‌తి ఫ్రేమ్ ఒక ఎక్స్‌పీరియ‌న్స్‌డ్ డైరెక్ట‌ర్ లాగా తీశారు. అలాగే మా ఎడిట‌ర్ జె.పి గారు, డిఓపి శ్రీనివాస్ చాలా స‌పోర్ట్ చేశారు. హీరోహీరోయిన్లు వీరిద్ద‌రి కోస‌మే ఈ సినిమా పుట్టిందా? అనేంత‌ పోటా పోటిగా న‌టించారు. అలాగే ఈ సినిమాకి ఆదిత్య వారు కూడా చాలా స‌హ‌క‌రించారు. ఈ సినిమాలో న‌టించిన అంద‌రి కెరీర్లో ఇది బెస్ట్ మూవిగా నిలిచిపోతుంది. అంద‌రూ సినిమా చూసి మా సినిమాను పెద్ద స‌క్సెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను“అన్నారు.

ద‌ర్శ‌కుడు న‌వీన్ నాయ‌ని మాట్లాడుతూ – రాజ్ కందుకూరి గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా చేసే అవ‌కాశం ఇచ్చిన నిర్మాత లింగేశ్వ‌ర్ గారికి థాంక్స్. సినిమా మేము అనుకున్న దానిక‌న్నా హార్ట్ ట‌చింగ్ గా వచ్చింది. ఈ సినిమాకు ప్ర‌తి టెక్నీషియ‌న్ 100ప‌ర్సెంట్ ఎఫ‌ర్ట్ పెట్టారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి త్వ‌ర‌లో మీ ముందుకు తీసుకువ‌స్తాం“ అన్నారు.

హీరో త‌రుణ్ మాట్లాడుతూ – ఈ సినిమాలో అంద‌రూ కొత్త‌వారే,, మా అంద‌రిని న‌మ్మి ఇంత మంచి సినిమా తీసిన మా ద‌ర్శ‌కుడు న‌వీన్‌, నిర్మాత లింగేశ్వ‌ర్ గారికి థాంక్స్‌. మా సినిమా తెలుగు,త‌మిళ్‌,క‌న్న‌డ భాష‌ల‌లో విడుద‌ల‌వుతుంది. సాంగ్స్ చాలా బాగా వ‌చ్చాయి. టీమ్ అంద‌రూ చాలా స‌పోర్ట్ చేశారు. అంద‌రూ థియేట‌ర్‌లో సినిమా చూసి ఎంజాయ్‌చేయండిఅన్నారు.

హీరోయిన్ మాట్లాడుతూ – మా ట్రైల‌ర్ రిలీజ్ చేసిన ప్ర‌ముఖ నిర్మాత రాజ్ కందుకూరి గారికి థాంక్స్. నాకు ఈ అవ‌కాశం రావ‌డానికి కార‌ణం మా ద‌ర్శ‌కుడు నవీన్, అలాగే సినిమా ఇంత బాగా రావ‌డానికి కార‌ణం మా నిర్మాత. అలాగే మా డి.ఓ.పి గారు న‌న్ను చాలా అందంగా చూపించారు. త‌ప్ప‌కుండా అంద‌రూ సినిమా చూడండి అన్నారు.

సినిమాటోగ్రాఫర్: శ్రీనివాస్ విన్నకోట, మాటలు: సుబ్బారాయుడు బొంపెం, ఎడిటర్: జె.పి, ఫైట్స్: రామ్ సుంకర, నబ, సుబ్బు, మ్యూజిక్ : సాబు వర్గీస్, ఆర్ ఆర్: యెలెందర్ మహావీర్, నిర్మాత : డా. కె. లింగేశ్వర్:
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నవీన్ నాయని.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read