Wednesday, February 1, 2023
Homeతెలుగు వార్తలుమాస్ మహారాజా రవితేజ సోదరుడి కుమారుడిని హీరోగా పరిచయం

మాస్ మహారాజా రవితేజ సోదరుడి కుమారుడిని హీరోగా పరిచయం

నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్న బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ‘ఏయ్… పిల్లా’

- Advertisement -

మాస్ మహారాజా రవితేజ సోదరుడు, కొన్ని చిత్రాల్లో హీరోగా, ఆర్టిస్టుగా నటించిన రఘు కుమారుడు మాధవ్ భూపతిరాజును కథానాయకుడిగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఓ సినిమా నిర్మిస్తున్నారు. భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ లవ్ స్టొరీగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ఏయ్… పిల్లా’ టైటిల్ ఖరారు చేశారు.

ఈ సందర్భంగా నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) మాట్లాడుతూ ”హృదయానికి హత్తుకునే ఓ అందమైన ప్రేమకథా చిత్రమిది. థియేటర్లలో ప్రేక్షకులకు చక్కటి అనుబూతి ఇస్తుంది. వింటేజ్ ప్రేమకథగా 90ల నేపథ్యంలో రూపొందిస్తున్నాం. సెప్టెంబర్ నుంచి చిత్రీకరణ ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నాం. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. మరిన్ని వివరాలు వెల్లడిస్తాం” అని అన్నారు. 

‘ఏయ్… పిల్లా’ చిత్రంలో మాధవ్ భూపతిరాజు సరసన మిస్ ఇండియా ఫస్ట్ రన్నరప్ రూబల్ షికావత్ నటిస్తున్నారు. కథానాయికగా ఆమెకు తొలి చిత్రమిది. ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ ఈ చిత్రానికి కథ అందిస్తుండటం విశేషం. లుధీర్ బైరెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి శ్యామ్ కె నాయుడు ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రానికి సంభాషణలు : అన్వర్ , కూర్పు: ప్రసన్న, కళ : చిన్నా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : గణేష్ ముప్పానేని.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

Tollywood News

Most Read