Tuesday, April 16, 2024
Homeతెలుగు వార్తలువన్ నైట్ 999 మూవీ పోస్టర్ అండ్ ట్రైలర్ లాంచ్!

వన్ నైట్ 999 మూవీ పోస్టర్ అండ్ ట్రైలర్ లాంచ్!

- Advertisement -

నేచర్ ఆర్ట్స్ బ్యానర్ లో నవ ఉదయం సమర్పించు బాలరాజు ఎస్ నిర్మాతగా మరియు దర్శకుడిగా నిర్మించిన చిత్రం పోస్టర్ లాంచ్, ట్రైలర్ లాంచ్ కార్యక్రమం టాలీవుడ్ నిర్మాత రామసత్యనారాయణ చేతుల మీదుగా ఆవిస్కరించారు, ఈ కార్యక్రమంలో వన్ నైట్999 మూవీ డైరెక్టర్ బాలరాజు ఎస్, డిఓపి జాకట రమేష్ ముఖ్య పాత్రధారి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రామసత్యనారాయణ మాట్లాడుతూ…
మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది, హెల్ప్ టు హెల్ప్ కాన్సెప్ట్ తో మంచి మెసేజ్ తో నేచర్ ఆర్ట్స్ బ్యానర్ లో ఈ చిత్రం నిర్మించి నందుకు డైరెక్టర్ బాలరాజు ఎస్, డిఓపి జాకట రమేష్ కు ఈ చిత్ర నటీనటులకు అభినందనలు తెలిపారు

డైరెక్టర్ & ప్రొడ్యూసర్ బాలరాజు ఎస్ మాట్లాడుతూ…
నేను గతంలో రెండు షార్ట్ ఫిలింస్ తీసాను, అందులో ఓ నిమిషం షార్ట్ ఫిలింకు ఉత్తమ ఫిలిం అవార్డ్ లభించింది, ఇది మూడవ సినిమాగా హెల్ప్ టు హెల్ప్ అనే కాన్సెప్ట్ ను తెరమీద చూపించబోతున్నాము.

నటీనటులు:
దిల్ ప్రీత్, కోనేటి వెంకటేష్, రత్న, దర్బార్, అమృత్.

సాంకేతిక నిపుణులు:
నిర్మాత, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: బాలరాజు.ఎస్
సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఎస్.ఎఫ్.ఎక్స్: జాకట రమేష్
పోస్టర్: గౌతమ్
డబ్బింగ్: మిస్పా మూవీ మీడియా
పిఆర్ఓ: మధు. VR

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

Tollywood News

Most Read