Thursday, April 25, 2024
Homeతెలుగు వార్తలు"చినుకు చినుకుతో మణిహారం అల్లుకున్నదే" అంటున్న "నరసింహపురం"

“చినుకు చినుకుతో మణిహారం అల్లుకున్నదే” అంటున్న “నరసింహపురం”

గీత్ గౌరవ్ సినిమాస్ పతాకంపై.. పి.ఆర్.క్రియేషన్స్ సమర్పణలో టి.ఫణిరాజ్ గౌడ్- నందకిశోర్ ధూళిపాలతో కలిసి శ్రీరాజ్ బళ్లా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఫ్యామిలీ ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘నరసింహపురం’. పలు సీరియల్స్, సినిమాల ద్వారా సుపరిచితుడైన నందకిశోర్ ఈ చిత్రం ద్వారా హీరోగా మారుతున్నారు. సిరి హనుమంతు హీరోయిన్ గా నటిస్తుండగా.. వర్ధమాన నటి ఉష హీరో చెల్లెలు పాత్రలో నటించారు.
వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతూ… అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో అత్యద్భుతంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది.

- Advertisement -

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్స్, ఒక లిరికల్ వీడియోతో అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షించిన ఈ చిత్రం నుంచి చిత్ర బృందం సమక్షంలో తాజాగా మరో సాంగ్ రిలీజ్ అయ్యింది. “చినుకు చినుకుతో మణిహారం అల్లుకున్నదే” అనే పల్లవితో సాగే ఈ పాటను శ్రీరాజ్ బళ్లా స్వయంగా ఆలపించడం విశేషం. గడ్డం వీరు ఈ చిత్రంలోని పాటలన్నీ రాయగా.. ఫ్రాంక్లిన్ సుకుమార్ సంగీతం అందించారు.
ఈ కార్యక్రమంలో హీరో నందకిషోర్, దర్శకులు శ్రీరాజ్ బళ్ళా, నిర్మాతల్లో ఒకరైన ఫణిరాజ్ గౌడ్, సంగీత దర్శకులు ఫ్రాంక్లిన్ సుకుమార్, ఎడిటర్ శివ.వై.ప్రసాద్, వి-ఎఫెక్ట్స్ చందు ఆది పాల్గొన్నారు.


చిత్ర దర్శకుడు శ్రీరాజ్ బళ్ళా మాట్లాడుతూ…”హీరోగా పరిచయమవుతున్న ప్రముఖ నటుడు నందకిషోర్ నటన, ఫ్రాంక్లిన్ సుకుమార్ సంగీతం, శివ ఎడిటింగ్, చందు ఆది విజువల్ ఎఫెక్ట్స్ ‘నరసింహపురం’ చిత్రానికి ముఖ్య ఆకర్షణలుగా నిలుస్తాయి” అన్నారు.


ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ అప్పాజీ, సంగీతం: ఫ్రాంక్లిన్ సుకుమార్, నిర్మాతలు: శ్రీరాజ్ బళ్ళా- టి.ఫణిరాజ్ గౌడ్-నందకిశోర్ ధూళిపాల, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీరాజ్ బళ్ళా!!

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

Tollywood News

Most Read