Saturday, April 20, 2024
Homeతెలుగు వార్తలుసినిమా వార్తలుశభాష్ శ్రీరాజ్ 'నరసింహపురం' చిత్రానికి సెన్సార్ సభ్యుల ప్రశంసల వెల్లువ

శభాష్ శ్రీరాజ్ ‘నరసింహపురం’ చిత్రానికి సెన్సార్ సభ్యుల ప్రశంసల వెల్లువ

గీత్ గౌరవ్ సినిమాస్ పతాకంపై.. పి.ఆర్.క్రియేషన్స్ సమర్పణలో టి.ఫణిరాజ్ గౌడ్-నందకిశోర్ ధూళిపాలతో కలిసి ‘శ్రీరాజ్ బళ్లా’ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఫ్యామిలీ ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘నరసింహపురం’. పలు సీరియల్స్, సినిమాల ద్వారా సుపరిచితుడైన నందకిశోర్ ఈ చిత్రం ద్వారా హీరోగా మారుతున్నారు. సిరి హనుమంతు హీరోయిన్ గా నటిస్తుండగా.. వర్ధమాన నటి ఉష హీరో చెల్లెలు పాత్రలో నటించారు.

ఇటీవల ఈ చిత్రం సెన్సార్ పూర్తయింది. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు.. ‘ఇటీవలకాలంలో తాము చూసిన చాలా మంచి సినిమాల్లో ‘నరసింహపురం’ ఒకటని’ చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ సందర్భంగా దర్శకనిర్మాత శ్రీరాజ్ బళ్లా మాట్లాడుతూ.. “సెన్సార్ బోర్డ్ మెంబర్స్ మా చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్ ఇవ్వడంతోపాటు… హోల్ హార్టెడ్ గా కాంప్లిమెంట్స్ ఇవ్వడం మాకు చాలా సంతోషంగానూ, గర్వంగానూ ఉంది. థియేటర్లు ఓపెన్ అయిన వెంటనే “నరసింహపురం” చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సినిమా ఇంత బాగా రావడానికి కారకులైన మా టీమ్ అందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను” అన్నారు!!

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

Tollywood News

Most Read