Friday, March 29, 2024
Homeతెలుగు వార్తలుఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ అలా నిన్ను చేరి టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ రిలీజ్

ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ అలా నిన్ను చేరి టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ రిలీజ్

మ్మలపాటి శ్రీధర్ సమర్పణలో మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం చేస్తూ కొమ్మలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్న చిత్రం ‘అలా నిన్ను చేరి’. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. హుషారు సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న హీరో దినేష్ తేజ్ మరోసారి ఈ విలక్షణ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

- Advertisement -

ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా నేటితరం ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ కూడా షురూ చేసి నూతన సంవత్సర కానుకగా అలా నిన్ను చేరి టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ టైటిల్ లోగో పోస్టర్‌ని చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసి సినిమా సోల్ తెలిసేలా స్పెషల్ గా అట్రాక్ట్ చేశారు మేకర్స్. ఓ పక్క పల్లెటూరు, మరోపక్క మెట్రో సిటీ.. ఈ రెండు ప్రదేశాలను కలుపుతూ హీరోని బ్యాక్ నుంచి చూపించారు. ఈ పోస్టర్ చూస్తుంటే పల్లెటూరు నుంచి కెరీర్ కోసం సిటీకి చేరిన కుర్రాడు.. అమ్మాయి ప్రేమలో పడి తన జర్నీ ఎలా సాగించాడనేది ఈ సినిమా కథ అని తెలుస్తోంది.

‘అలా నిన్ను చేరి’ సినిమాకు పాటలు చంద్రబోస్, సంగీతం సుభాష్ ఆనంద్ అందిస్తుండగా.. ఆండ్రూ కెమెరా మెన్ గా పనిచేస్తున్నారు. ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్‌గా విఠల్, ఎడిటర్ గా పలు సూపర్ హిట్ సినిమాలకు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించిన కోటగిరి వెంకటేశ్వర రావు పని చేస్తున్నారు. కర్నాటి రాంబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ గా చేస్తున్న ఈ సినిమాకు క్యాస్టూమ్ డిజైనర్‌గా ముదసరా మహ్మద్ వ్యవహరిస్తున్నారు. సాల్మన్, రామకృష్ణ ఫైట్ మాస్టర్లుగా, సాంగ్స్ కొరియోగ్రాఫర్ గా భాను వర్క్ చేశారు. అతిత్వరలో ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

Tollywood News

Most Read