Saturday, June 22, 2024
Homeతెలుగు వార్తలుప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా సుజి విజువల్స్ చిత్రం ప్రారంభం

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా సుజి విజువల్స్ చిత్రం ప్రారంభం

Johny Master and actress Digangana Suryavanshi

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా ‘హిప్పీ’ ఫేమ్ దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా సుజి విజువల్స్ బ్యానర్‌పై మురళిరాజ్ తియ్యాన దర్శకత్వంలో నిర్మాత కే వెంకటరమణ నిర్మిస్తున్న చిత్రం ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. ఈ ప్రారంభ వేడుకకు ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్, నిర్మాత లగడపాటి శ్రీధర్, ప్రముఖ నటుడు నాగబాబు, యాంకర్ ప్రదీప్ హాజరయ్యారు. తొలి షాట్‌కు దర్శకత్వం వహించిన వీవీ వినాయక్ క్లాప్ కొట్టారు. నటుడు నాగబాబు కెమెరా స్విచ్ఛాన్ చేశారు.

- Advertisement -

ఈ సందర్బంగా నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. ‘‘జానీ మాస్టర్ డెఫినెట్‌గా వండర్‌పుల్ యాక్టర్ అవుతారు. ఎంటర్‌టైనింగ్ హీరోగా అవుతారనే నమ్మకం బలంగా కలిగింది. ఫస్ట్ లుక్ పోస్టర్లు చూస్తే చాలా ఇన్నోవేటివ్‌గా ఉన్నాయి. వాటితో దర్శకుడు అభిరుచి ఏమిటో తెలిసింది. త్వరలోనే జానీ మాస్టర్‌తో స్టైల్‌2 సినిమా ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నాం. చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఆయనతో మున్ముందు అసోసియేట్ కావాలనుకొంటున్నాను. ఈ చిత్రంలో నటిస్తున దిగంగనకు, యూనిట్‌కు బెస్ట్ విషెస్‘‘ అని అన్నారు.

యాంకర్ ప్రదీప్ మాట్లాడుతూ.. ‘‘మా జానీ మాస్టర్ హీరోగా పరిచయం అవుతున్నారంటే మాకు చాలా ఆనందం. కెమెరా ముందు ఎంత యాక్టివ్‌గా ఉంటారో.. కెమెరా వెనుక కూడా అంతే ఎనర్జీతో రౌండ్ ది క్లాక్ ఉంటారు. మాకు డార్లింగ్.. మాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఆయన మొదటి ప్రయత్నం ఇది. సినిమాకు సంబంధించిన అన్ని విభాగాలపై మంచి అవగాహన ఉంది. అలాంటి మా మాస్టర్ హీరోగా సక్సెస్‌ఫుల్ కావాలని కోరుకొంటున్నాను. ఇప్పటి వరకు తెర మీద డ్యాన్స్ మాత్రమే చూశాం. ఇక తెర మీద ఆయన యాక్టింగ్, డైలాగ్ డెలివరీ ఎప్పుడెప్పుడూ చూడాలా అని ఎదురు చూస్తున్నాం. ఆయన కొరియోగ్రాఫి చేస్తే ఎన్ని కోట్ల వ్యూస్ వస్తాయో ఆయన సినిమాకు అన్ని కోట్ల కలెక్షన్లు రావాలని కోరుకొంటున్నాను’’ అని అన్నారు.

హీరోయిన్ దిగంగన సూర్యవంశీ మాట్లాడుతూ.. జానీ మాస్టర్‌తో నటించడం చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. ఈ సినిమా స్క్రిప్ట్ బ్రిల్లియెంట్. ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించినందుకు నా నిర్మాత, దర్శకులు, రచయితలకు ధన్యవాదాలు అని అన్నారు.

హీరో జానీ మాస్టర్ మాట్లాడుతూ.. ‘‘నేను హీరోగా పరిచయం అవుతున్న సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన దర్శకులు వీవీ వినాయక్ గారికి, నిర్మాత లగడపాటి శ్రీధర్, నాగబాబు గారికి, యాంకర్ ప్రదీప్‌కు ధన్యవాదాలు. నాకు కొరియోగ్రఫి అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కూడా శివకార్తికేయన్‌ నటించే సినిమాలోని పాటకు కొరియోగ్రఫి చేస్తున్నాను. ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణాలు చెప్పలేను. నాకు కొరియోగ్రఫి, డైరెక్షన్ అంటే ఇష్టం. దర్శకుడికి అదే విషయాన్ని చెప్పాను. యాక్టింగ్ అంతగా ఇష్టం లేదని చెప్పాను. కానీ దర్శకుడు చెప్పిన కథ విన్న తర్వాత తప్పకుండా చేయాలని డిసైడ్ అయ్యాను. నాకు షూటింగ్ లేనప్పుడు టీవీ షూటింగ్‌లకు వెళ్తాను. ఇప్పుడు కొరియోగ్రఫి విషయంలో విరామం దొరికితే సినిమా షూటింగుకు వెళ్తాను. నీవు చేయకపోతే సినిమా చేయనని నిర్మాత వెంకటరమణ చెప్పడంతో మరింత కనెక్ట్ అయ్యాను. నా పక్కన నటించడానికి ముందుకొచ్చిన దిగంగనకు థ్యాంక్స్’’ అని అన్నారు.

నిర్మాత వెంకటరమణ. కె మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాని, సుజి విజువల్స్ బ్యానర్ పై ప్రొడ్యూస్ చేస్తున్నాను. జానీ మాస్టర్ గారి కోరియోగ్రఫీ మాకు చాలా ఇష్టం. ఆయనతో ఎప్పుటికైనా సినిమా చేయాలి అనుకున్నాం, అది ఈ విధంగా కుదిరింది. కథని నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళాం, ఆయనకి మా డైరెక్టర్ మురళి చెప్పిన కథ నచ్చడంతో మెచ్చుకుని సినిమా చేస్తా అన్నారు. మంచి టీమ్ కూడా కుదిరింది‘‘ అని అన్నారు.

నాగబాబు గారు మాట్లాడుతూ, “జానీ మాస్టర్ మా అందరికీ, ముఖ్యంగా మా మెగా ఫామిలీ కి చాలా ఆత్మీయుడు. చాలా టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ & అద్భుతమైన దర్శకత్వ ప్రతిభ ఉన్న వ్యక్తి. తను వచ్చి హీరోగా సినిమా చేస్తున్నాను అని చెప్పగానే సరైన నిర్ణయమే తీసుకున్నాడు అనిపించింది ఎందుకంటే మన కళ్ళ ముందే డాన్స్ మాస్టర్లు లారెన్స్, ప్రభుదేవాలు హీరోలుగా మారి మంచి సక్సెస్ ని కూడా అందుకున్నారు. అద్భుతమైన డాన్స్ ప్రతిభ అలాగే అందం ఉన్నవాడు జానీ, ఇలాంటి మంచి కథ తో హీరోగా ఇండస్ట్రీ లో నిలదొక్కుకుంటాడని నేను నమ్ముతున్నాను. కానీ ఎంత పెద్ద హీరో అయినా, ఎంత మంచి సక్సెస్ వచ్చినా కొరియోగ్రఫీ మాత్రం వదలద్దని మాత్రం జానీ కి నా వ్యక్తిగత కోరిక & సలహా. ఈ ‘జె1’ చాలా పెద్ద హిట్ అవ్వాలి, మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని అన్నారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read