Monday, December 23, 2024
HomeMovie News'హను- మాన్' సీక్వెల్ కు బ్రేక్ పడిందా..?

‘హను- మాన్’ సీక్వెల్ కు బ్రేక్ పడిందా..?

- Advertisement -

తేజ సజ్జ – ప్రశాంత్ వర్మ కలయికలో తెరకెక్కిన హనుమాన్ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా మూవీ గా విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమా సూపర్ హిట్ తో దీనికి సీక్వెల్ ప్రకటించారు. ‘జై హనుమాన్’ పేరుతో వచ్చే సంక్రాంతికి ఈ సీక్వెల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ సీక్వెల్ కు బ్రేక్ పడిందనే వార్త చక్కర్లు కొడుతోంది.

‘హను- మాన్’ వల్ల ప్రశాంత్ వర్మకు దేశవ్యాప్తంగా క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రేజ్ తో ప్రశాంత్
కు బాలీవుడ్​లో ఓ సూపర్ ఛాన్స్ వచ్చిందట. బాలీవుడ్ స్టార్ హీరో రణ్​వీర్ సింగ్, ప్రశాంత్​తో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. దీంతో ‘జై హనుమాన్’ సినిమాను హోల్డ్​లో పెట్టి రణ్​వీర్​​ హిందీ ప్రాజెక్ట్​ను పట్టాలెక్కించాలని ప్రశాంత్ డిసైడైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఇక ఈ ప్రాజెక్ట్​ను 2025 లోనే కంప్లీట్ చేయలని ప్రశాంత్ భావిస్తున్నారట.

ఈ సినిమా కూడా ప్రశాంత్ వర్మ యూనివర్స్​ (PVCU)లో భాగంగా సూపర్ హీరో కాన్సెప్ట్​తోనే తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. అటు రణ్​వీర్ కూడా సూపర్ హీరో సినిమా చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారట. దీంతో ఇది బాలీవుడ్​లోనూ హాట్​ టాపిక్​గా మారింది. ఒకవేళ ఇదే నిజమైతే ‘జై హనుమాన్’ కోసం ప్రేక్షకులు 2026 దాకా ఆగాల్సిందే అంటున్నారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read