Tuesday, May 21, 2024
HomeMovie Newsసీతారామం బ్యూటీకి ఎంగేజ్మెంట్ రింగ్ ..

సీతారామం బ్యూటీకి ఎంగేజ్మెంట్ రింగ్ ..

- Advertisement -

మృణాల్ ఠాకూర్..ప్రస్తుతం ఈ పేరు ఇండస్ట్రీ లో బాగా వినిపిస్తుంది. సీతారామం మూవీ తో తెలుగు లో ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది..ఫస్ట్ మూవీ తోనే యూత్ & ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైంది. ఇక నాన్న మూవీ తో మరో సూపర్ హిట్ కొట్టి..అసలైన గ్లామర్ తో యూత్ కు నిద్ర లేకుండా చేసింది. ఈ రెండు సూపర్ హిట్ల తర్వాత విజయ్ దేవరకొండ తో ఫ్యామిలీ స్టార్ మూవీ లో నటించింది. ఈ సినిమా ఫై గప్పెడు ఆశలు పెట్టుకుంది కానీ..ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం తెలుగు లో ఇంకా కొత్త సినిమాలకు సైన్ చేయని..ఈ బ్యూటీ బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలు చేస్తుంది.

ఇదిలా ఉంటె సోషల్ మీడియా లో నిత్యం యాక్టివ్ గా ఉండే ఈ భామ..తాజాగా ఒకరికి పంచ్ విసరబోయి..తానే పంచ్ వేసుకుంది. మృణాల్ బాలీవుడ్ హోస్ట్ తన్మయి భట్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ కు రిప్లై ఇచ్చింది. తన్మయి ఓ ఈవెంట్ కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ ఇక్కడ వీళ్లను నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. మరి నా లైఫ్ పార్టనర్ ను ఎవరు పరిచయం చేస్తారు? అంటూ ఫన్నీగా రాసుకొచ్చాడు.


ఆ పోస్ట్ చూసిన మృణాల్ .. అమ్మాయి దొరికిందా? అంటూ క్యూరియాసిటీతో ప్రశ్నించింది. అతనువెంటనే రియాక్ట్ అవుతూ అవును నిన్ననే కదా నీకు రింగ్ పంపించాను అంటూ రిప్లై ఇచ్చాడు. అతను ఫన్నీగానే ఇలా రిప్లై ఇచ్చినప్పటికీ వీళ్లిద్దరి మధ్య జరిగిన ఈ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ పై నెటిజన్ లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. కొంపదీసి మృణాల్ ఈ హోస్ట్ తో రిలేషన్షిప్ లో లేదు కదా అనే డౌట్ వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read