Saturday, April 20, 2024
Homeతెలుగు వార్తలుపోస్ట్ ప్రొడక్షన్ లో అడుగు పెట్టిన "ఎక్కడికో ఈ అడుగు'

పోస్ట్ ప్రొడక్షన్ లో అడుగు పెట్టిన “ఎక్కడికో ఈ అడుగు’

‘ఎఫెక్ట్స్ రాజు’గా పరిశ్రమ వర్గాలకు సుపరిచితుడైన శ్రవణ్ బొనగాని దర్శకత్వంలో ‘స్కై లైన్ ఎంటర్ టైన్మెంట్స్’ పతాకంపై తొలి ప్రయత్నంగా అట్లూరి శ్రీనివాస్ నిర్మిస్తున్న విభిన్న ప్రేమకథా చిత్రం “ఎక్కడికో ఈ అడుగు”.

- Advertisement -


గోపీకృష్ణ-ప్రియాంక చౌదరి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో జయప్రకాష్ (తమిళ్), తోటపల్లి మధు, పిల్లా ప్రసాద్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

1990లో జరిగిన ఓ యదార్ధ సంఘటన ఆధారంగా.. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటోంది.
త్వరలోనే ఫస్ట్ లుక్ విడుదల చేసుకోనున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ అప్పాజీ, కో-డైరెక్టర్: నాగరాజు, ఆర్ట్: ఆరె వెంకటేష్, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, సంగీతం: దిలీప్ బండారి, ఛాయాగ్రహణం: ఈశ్వర్ ఎల్లుమహంతి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు, నిర్మాత: అట్లూరి శ్రీనివాస్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రవణ్ బొనగాని!!

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

Tollywood News

Most Read