Sunday, November 3, 2024
Homeతెలుగు వార్తలుడైరెక్ట‌ర్ క్రిష్ చేతుల మీదుగా శ్రియా శ‌ర‌ణ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'గ‌మ‌నం' ఫ‌స్ట్ లుక్...

డైరెక్ట‌ర్ క్రిష్ చేతుల మీదుగా శ్రియా శ‌ర‌ణ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘గ‌మ‌నం’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

అంద‌చందాలు, అభిన‌య సామ‌ర్థ్యం క‌ల‌బోసిన న‌టీమ‌ణుల్లో ముందు వ‌రుస‌లో ఉండే తార శ్రియా శ‌ర‌ణ్‌. అందుకే దాదాపు రెండు ద‌శాబ్దాలుగా ప్రేక్ష‌కుల ఆరాధ్య తార‌గా రాణిస్తూ వ‌స్తున్నారు. భార‌త‌దేశ‌పు అత్యంత ప్ర‌తిభావంతులైన న‌టీమ‌ణుల్లో ఒక‌రైన శ్రియ‌ కొంత విరామంతో సినిమాల్లోకి తిరిగొచ్చారు.

- Advertisement -

రియ‌ల్ లైఫ్ డ్రామాగా సుజ‌నా రావు డైరెక్ట్ చేస్తున్న ‘గ‌మ‌నం’ చిత్రంలో శ్రియ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందుతోంది.

శ్రియా శ‌ర‌ణ్‌ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈరోజు ‘గ‌మ‌నం’ ఫిల్మ్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను క్రియేటివ్ డైరెక్ట‌ర్ క్రిష్ విడుద‌ల చేశారు. గ‌తంలో ఆయ‌న డైరెక్ష‌న్‌లో శ్రియ న‌టించారు.

ఈ పోస్ట‌ర్‌లో చీర క‌ట్టుకొని, మెడ‌లో మంగ‌ళ‌సూత్రం మాత్ర‌మే ఉన్న ఒక అతి సాధార‌ణ గృహిణిలా క‌నిపిస్తున్నారు శ్రియ‌. ఏ విష‌యం గురించో తీవ్రంగా ఆలోచిస్తున్న‌ట్లు ఆమె ముఖంలోని భావాలు తెలియ‌జేస్తున్నాయి. మొత్తానికి ఇదివ‌ర‌కెన్న‌డూ చేయ‌ని పాత్ర‌లో శ్రియ క‌నిపించ‌నున్నార‌ని ఆమె రూపం తెలియ‌జేస్తోంది.

మాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ ర‌చ‌యిత సాయిమాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు రాస్తున్నారు.

సినిమాటోగ్రాఫ‌ర్‌గా ఈ చిత్రానికి ప‌నిచేస్తున్న జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్‌. నిర్మాత అవ‌తారం కూడా ఎత్తి, ర‌మేష్ క‌రుటూరి, వెంకీ పుష‌డ‌పు ల‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

షూటింగ్ మొత్తం పూర్త‌యిన ‘గ‌మ‌నం’ చిత్రానికి సంబంధించి ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో ఈ చిత్రంలో ప‌నిచేస్తున్న తారాగ‌ణం వివ‌రాల‌ను వెల్ల‌డించ‌నున్నారు.

సాంకేతిక బృందం:
డైలాగ్స్‌: సాయిమాధ‌వ్ బుర్రా
మ్యూజిక్‌: మాస్ట్రో ఇళ‌య‌రాజా
సినిమాటోగ్ర‌ఫీ: జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్‌.
ఎడిటింగ్‌: రామ‌కృష్ణ అర్రం
నిర్మాత‌లు: ర‌మేష్ క‌రుటూరి, వెంకీ పుష‌డ‌పు, జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్‌.
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: సుజ‌నా రావు

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read