Monday, December 23, 2024
Homeతెలుగు వార్తలుడిఫ‌రెంట్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ `మాయ‌` ఫ‌స్ట్‌లుక్‌కి సూప‌ర్ రెస్పాన్స్‌.

డిఫ‌రెంట్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ `మాయ‌` ఫ‌స్ట్‌లుక్‌కి సూప‌ర్ రెస్పాన్స్‌.

ప్రవాస భారతీయురాలైన రాధికా జయంతి దర్శకత్వంలో తెర‌కెక్కిన చిత్రం మాయ. సంధ్య బయిరెడ్డి ప్ర‌ధాన పాత్ర‌ పోషించ‌గా, రోహిణి కుమార్, అభిషేక్, ఐడా, మధు, మహిమా ఇత‌ర పాత్రధారులుగా నటించారు. రేస‌న్ ప్రొడ‌క్ష‌న్స్‌, విఆర్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకాల‌పై గోపికృష్ణ జ‌యంతి నిర్మించారు. ప్ర‌ముఖ హాలీవుడ్ సినిమాటోగ్రాఫ‌ర్ డ‌స్టిన్ లీ ఈ చిత్రానికి వ‌ర్క్ చేయ‌డం విశేషం. ఇప్ప‌టికే విడుద‌లైన ప్రీ లుక్ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ రాగా మాయఫ‌స్ట్‌లుక్‌ని ఇటీవ‌ల ప్ర‌ముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడు‌ద‌ల‌చేశారు. ఈ ఫ‌స్ట్ లుక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండ‌డంతోపాటు సినిమా మీద క్యూరియాసి‌టీని పెంచి ప్రేక్ష‌కుల‌ని ఇంప్రెస్ చేస్తోంది. ఈ సంద‌ర్భంగా..

- Advertisement -

నిర్మాత గోపికృష్ణ జ‌యంతి‌ మాట్లాడుతూ – ప్రీ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ లుక్ కి కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తున్నందుకు హ్యాపీగా ఉంది. పూర్తిగా సినిమా ఇండ‌స్ట్రీ ప‌ట్ల ప్యాష‌నేట్ టీం తో కంప్లీట్‌గా అమెరికాలోని రిచ్ లొకేష‌న్స్‌లో `మాయ` మూవీ ని తెర‌కెక్కించ‌డం జ‌రిగింది. మేకింగ్‌లో హాలీవుడ్ ఇండ‌స్ట్రీలో శిక్ష‌ణ తీసుకున్న రాధిక జ‌యంతి ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌యం అవుతున్నారు. హాలీవుడ్ సినిమాటోగ్రాఫ‌ర్ డ‌స్టిన్ లీ విజుల‌వ్స్ త‌ప్ప‌కుండా ఆడియ‌న్స్‌ని థ్రిల్ చేస్తాయి. పలు లఘు చిత్రాలకి సంగీతం అందించిన ప్రణీత్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఈ మూవీకి త‌న బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ మూవీ త‌ప్ప‌కుండా ఆడియ‌న్స్‌కి ఒక మంచి ఎక్స్‌పీరియ‌న్స్ నిస్తుందిఅన్నారు.

ద‌ర్శకురాలు రాధిక జ‌యంతి మాట్లాడుతూ – నిర్మాతల స‌హాయంతో అమెరికాలోని రిచ్‌లోకేష‌న్స్‌లో పూర్తి సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రిపాం. ఔట్‌పుట్ చాలా బాగా వ‌చ్చింది. అమెరికాలో సింగ‌ర్‌గా సుప‌రిచితుడు అయిన కార్తిక్ జ‌యంతి ఈ చిత్రానికి క‌థ అందించారు. `మిస్ భార‌త్ usa ` విన్న‌ర్ సంధ్య టైటిల్‌రోల్ పోషిస్తుండ‌గా ఫ్యాషన్ దివా రోహిణి, అభిషేక్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఒక డిఫ‌రెంట్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ గా ఈ మూవీ త‌ప్ప‌కుండా ఆడియ‌న్స్‌ని థ్రిల్ చేస్తుంది. త్వ‌ర‌లోనే టీజ‌ర్ విడుద‌ల‌చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం అన్నారు.

సంధ్య బయిరెడ్డి, రోహిణి కుమార్, అభిషేక్, ఐడా, మధు, మహిమా త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి

క‌థ మరియూ రచనా సహకారం : కార్తీక్ జయంతి, వివేక్ వర్ధన్

సహాయ దర్శకత్వం : కార్తీక్ జయంతి

సినిమాటోగ్ర‌ఫి: డ‌స్టిన్ లీ,

మ్యూజిక్ : ప‌్ర‌ణీత్‌,

ఎడిటింగ్: ప్రీతూ,

పిఆర్ఓ: సాయి స‌తీష్‌,

నిర్మాత‌లు : గోపికృష్ణ జ‌యంతి‌, రోహిణి కుమార్‌, విజయా‌ మోహన్

ద‌ర్శ‌క‌త్వం: రాధిక జ‌యంతి.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read