Tuesday, December 24, 2024
Homeతెలుగు వార్తలు"చీమ - ప్రేమ మధ్యలో భామ!" విడుదలకు సిద్ధం!

“చీమ – ప్రేమ మధ్యలో భామ!” విడుదలకు సిద్ధం!

ఈ సృష్టి లోని ఒకానొక అత్యంత అల్ప ప్రాణి అయిన చీమ మనిషిగా మారాలని మనసు పడుతుంది! అంత వరకు బాగానే ఉంది – మరి అది సాధ్యమా ? ఏం జరుగుతుంది ? అసలు ఆ భావన ఎలా ఉంటుంది ? పైగా దానికి ప్రేమ, శృంగారం తోడైతే… అది ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలే “చీమ – ప్రేమ మధ్యలో భామ! ” సినిమా.

- Advertisement -

మాగ్నమ్ ఓపస్ (Magnum Opus ) ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకం పై శ్రీకాంత్ “శ్రీ” అప్పల రాజు దర్శకత్వం లో ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న చిత్రం “చీమ – ప్రేమ మధ్యలో భామ !”. అమిత్ మరియు ఇందు హీరో హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఫస్ట్ కాపీ సిద్ధం గా ఉంది.

ఈ సందర్భం గా దర్శకుడు శ్రీకాంత్ “శ్రీ” అప్పల రాజు మాట్లాడుతూ ” చీమ – ప్రేమ మధ్యలో భామ!” ఓ యువజంట ప్రేమ ప్రయాణం. కుటుంబ విలువలతో, కామెడీ సన్నివేశాలతో ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని నిర్మించాము. మా సినిమా యూత్ మరియు ఫామిలీ ప్రేక్షకులకి బాగా నచ్చుతుంది. సంగీతం మరియు గ్రాఫిక్స్ వర్క్ చిత్రానికే హైలైట్ ” అని అన్నారు.

నిర్మాత ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ” మా చిత్రం లో చీమ ప్రధాన ఆకర్షణ. గ్రాఫిక్స్ చాలా బాగా వచ్చాయి. ఈ సినిమా కొత్తవాళ్లతో చిత్రీకరించినా ఖర్చుకి వెనకాడకుండా నిర్మించాము. రవి వర్మ గారు అందించిన సంగీతం మరియు ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం, గీతా మాధురి గార్లు పాడిన పాటలు చాలా బాగున్నాయి. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని సెప్టెంబర్ లో విడుదల చేస్తాము ” అని అన్నారు.

నటీ నటులు :

అమిత్, ఇందు, సుమన్, హరిత, పురంధర్ , వెంకట్ నిమ్మగడ్డ, రమ్య చౌదరి, బొమ్మ శ్రీధర్, రవి కిషోర్ , కిషోర్ రెడ్డి మరియు సురేష్ పెరుగు.

సంగీతం : రవి వర్మ, సింగర్స్ : ఎస్ పి బాలసుబ్రమణ్యం , గీతా మాధురి, సినిమాటోగ్రఫీ : ఆరిఫ్ లలాని, ఎడిటర్ : హరి శంకర్, కోరియోగ్రఫీ : చిరంజీవి, సుభాష్, ఆనంద్.

కథ, మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : శ్రీకాంత్ “శ్రీ” అప్పల రాజు

నిర్మాత : ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read