Monday, December 23, 2024
Homeతెలుగు వార్తలుచెడ్డి గ్యాంగ్ తమాషా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసిన హాస్యబ్రహ్మ పద్మశ్రీ బ్రహ్మానందం

చెడ్డి గ్యాంగ్ తమాషా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసిన హాస్యబ్రహ్మ పద్మశ్రీ బ్రహ్మానందం

అబుజా ఎంటర్టైన్మెంట్స్ మరియు శ్రీ లీల ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సి హెచ్ క్రాంతి కిరణ్ నిర్మాణ సారధ్యం లో, వెంకట్ కళ్యాణ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం చెడ్డీ గ్యాంగ్ తమాషా. గాయత్రి పటేల్ హీరోయిన్. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన హాస్యబ్రహ్మ పద్మశ్రీ బ్రహ్మానందం ట్రైలర్ ను విడుదల చేశారు.

- Advertisement -

నిర్మాత క్రాంతి కిరణ్ మాట్లాడుతూ: సినీ నిర్మాత అనేవాడు రైతు లాంటి వాడు. మా డబ్బులతో మీకు వినోదాన్ని ఇచ్చే టందుకు కృషి చేస్తాము. మేము చేస్తున్న ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. సినిమా మిమ్మల్ని అలరిస్తుంది. అందరికి నచ్చే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి చెడ్డి గ్యాంగ్ తమాషా పార్ట్2 కూడా ఉంటుంది.ఆన్నీ కుదిరితే పార్టీ 2 లో బ్రహ్మానందం గారు కూడా నటిస్తారు అని అన్నారు

పద్మశ్రీ బ్రహ్మానందం మాట్లాడుతూ: చిత్ర దర్శకుడు వెంకట్ కళ్యాణ్ దర్శకుడిగా హీరోగా ఈ చెడ్డి గ్యాంగ్ తో ఎంతో కష్టపడి అద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కించాడు అని అనుకుంటున్నాను.ఈ రోజుల్లో ఒక సినిమాని తియ్యడానికి నానా ఇబ్బంది పడుతున్న ఈ టైం లో ఇతను ఈ చెడ్డి గ్యాంగ్ తో సినిమా తీసాడు. ట్రైలర్ చాలా సహజంగా ఉంది. ఈ సినిమా సక్సెస్ కోసం మాస్టర్ జి లాంటి వారితో పాటలు రాయించికొని ఈ కుర్రాళ్లు అందరూ చేస్తున్న ఈ ప్రయత్నం తప్పకుండా సక్సెస్ అవుతుంది.సినిమా బాగుంటే అదే సక్సెస్ అవుతుంది.చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేదు.అందరూ సినిమాకి ఎంతో కష్ట పడి కృషి చేస్తారు.ఆ సినిమా సక్సెస్ ఫుల్ గా పైకి రావాలి అంటే అది చిన్న వాళ్ళ పెద్ద వాళ్ళ అని కాకుండా వాళ్ళల్లో ఉన్న టాలెంట్ ను మనం మెచ్చుకోవాలి అభినందించాలి.నిర్మాత క్రాంతి కిరణ్ చెడ్డి గ్యాంగ్ 2 తీస్తాడు అలాగే వరుసగా సినిమాలు తీస్తూ మంచి విజయాలు సాధించాలని నేను కోరుకుంటున్నాను. ఈ సినిమాని ఎంత కష్ట పడి నిర్మించాడో నాకు అర్ధమైంది. మంచి మనుషులు మంచి నటులు మంచి టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు నటించారు. చెడ్డీ గ్యాంగ్ తమాషా అంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేసాను.అందుకని ఒక హాస్య నటుడిగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కి వచ్చాను.హాస్య నటులు తీసే సినిమాలు అన్ని సక్సెస్ కావాలి అని హాస్యం బయటకు రావాలి అని మా గురువుగారు జంధ్యాల గారు బతికి వున్నప్పుడు చెపుతూ వుంటారు. హాస్యం బతకాలి అయ్యా హాస్యాన్ని మనం బతికించాలి అని అందుకని ఈ ఫంక్షన్ కి నేను రావడం జరిగింది.కాబట్టి హాస్యాన్ని బతికించండి మాతృ దేవోభవ పితృ దేవోభవ ఆచార్య దేవొ భవ అతిధి దేవొ భవ అది కాకుండా హాస్య నట దేవో భవ థాంక్ యు అని అన్నారు

హీరో, దర్శకుడు వెంకట్ కళ్యాణ్ మాట్లాడుతూ: నేను పవన్ కళ్యాణ్ విరాభిమానిని. నేను అతను ఇన్స్పిరేషన్ తోనే సినీ ఇండస్ట్రీకి వచ్చాను. చెడ్డీ గ్యాంగ్ సినిమా కాన్సెప్ట్ ఏమిటంటే ఒక పల్లెలో భూస్వామి ఆ ఉరి జనాల్ని పీడిస్తూ ఉంటాడు. పుచ్చల పల్లి సుందరయ్య గారు లాంటి కమ్యూనిస్టు భావాలున్న వ్యక్తి ఆ పల్లెని ఎలా కాపాడాడు అని. భవిష్యత్ లో ఇంకా మంచి సినిమాలు తీస్తాను. కొత్త వాడినైన నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత క్రాంతి కిరణ్ చాలా గొప్ప వ్యక్తి.నాలాగే టాలెంట్ ఉన్న వ్యక్తులకు అవకాశం ఇచ్చేందుకు రెడీ గా వున్నారు ఆయనకు నా కృతజ్ఞతలు.. ఇది కంప్లిట్ కామెడీ డ్రామా.అందరికి నచ్చుతుంది అని అన్నారు.

జనసేన తెలంగాణ యూత్ లిడార్ సంజయ్ నాయక్ మాట్లాడుతూ: మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి చిత్ర దర్శకుడు వెంకట్ కళ్యాణ్, ఈ సినిమా తో తానేంటో నిరూపించుకుంటాడు. నిర్మాత క్రాంతి కిరణ్ ఈ సినిమాతో మంచి సక్సెస్ రావాలి. సినిమా లో నటించిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా ద్వారా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను అని అన్నారు

సీనియర్ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ; హాస్యానికి ఒక గౌరవం మర్యాద ఉన్నతి మరియు హాస్య నటులకు ఒక గౌరవం తీసుకువచ్చిన బ్రహ్మనందం గారు ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది.అంత కొత్త వారితో చేసిన ఈ సినిమా నిర్మాత కానీ దర్శకుడు కానీ వాళ్ళు సినిమా లాభాలు గురించి ఆశ పడడం లేదు.. వాళ్ళు చేసిన కృషి కి పేరు, నెక్స్ట్ సినిమా తీయగలిగితే చాలు అని అనుకుంటారు.నిజంగా వీళ్ళ ప్రయత్నం సక్సెస్ కావాలి సినిమా ఘన విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను అని అన్నారు.

హీరోయిన్ గాయత్రి పటేల్ మాట్లాడుతూ: ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ తో పాటు ఎమోషన్ కూడా ఉంటుంది..నిర్మాత నాకు ఫాదర్ లాంటి వారు.ఈ సినిమాలో నేను చాలా అందంగా కనిపిస్తాను. నాకు ఈ ఆవకాశం ఇచ్చిన దర్శక నిర్మాత కు థాంక్స్ అని అన్నారు.

గేయ రచయిత మాస్టర్ జి, విహారి తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

నటీ నటులు, సాంకేతిక నిపుణులు
హీరో; వెంకట్ కళ్యాణ్
హీరోయిన్: గాయత్రి పటేల్
నిర్మాత : సి హెచ్ క్రాంతి కిరణ్
స్టొరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : వెంకట్ కళ్యాణ్
డి ఓ పి: జి కె యాదవ్ బంక
సంగీతం: అర్జున్ నల్లగొప్పుల
లిరిక్స్: విహారి
ఎడిటింగ్; నర్సింగ్ రాథోడ్
ఆర్ట్,; రెడాన్ ఎస్కే, ఎమ్ ఏ
కొరియోగ్రాఫర్ : భాను.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read