Tuesday, December 24, 2024
Homeతెలుగు వార్తలు'బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది` హీరోయిన్ సంజన చౌదరి ఇంట‌ర్వ్యూ

‘బొమ్మ అదిరింది – దిమ్మ తిరిగింది` హీరోయిన్ సంజన చౌదరి ఇంట‌ర్వ్యూ

జబర్ధస్త్’ కమెడియన్ షకలక శంకర్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్ టైనర్ “బొమ్మ అదిరింది – దిమ్మ తిరిగింది”. ఈ సినిమాతో కుమార్ కోట దర్శకునిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు.

- Advertisement -

మహంకాళి మూవీస్ మహంకాళి దివాకర్ సమర్పణలో మణిదీప్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మధు లుకాలపు – సోమేశ్ ముచర్ల నిర్మిస్తున్నారు. ప్రియ – అర్జున్ కళ్యాణ్ – రాజ్ స్వరూప్ – మధు – స్వాతి – అవంతిక హీనా – రితిక చక్రవర్తి – సంజన చౌదరి తదితరులు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఫణీంద్ర వర్మ అల్లూరి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పిఆర్ సంగీతం సమకూరుస్తున్నారు. హారర్ కామెడీ నేపథ్యంలో వ‌స్తోన్న ‘బొమ్మ అదిరింది – దిమ్మ తిరిగింది` త్వ‌ర‌లో విడుద‌ల‌కానున్న సంద‌ర్భంగా హీరోయిన్ సంజన చౌదరి చెప్పిన విశేషాలు..


*మా స్వ‌స్థ‌‌లం బీహార్‌, నేను హైద‌రాబాద్‌లోనే చ‌దువుకున్నాను. జ‌ర్న‌లిజంలో మాస్ట‌ర్స్ చేశాను.

*కాలేజ్ రోజుల్లో మూవీస్ పై ఇంట్రెస్ట్‌తో బ్యూటీ కాంపిటేష‌న్స్ లో పాల్గొన్నాను, ఆ త‌ర్వాత‌ మోడ‌ల్, అలా యాక్ట‌ర్‌ని అయ్యాను.

  • న్యూలీ మ్యారీడ్ అనే వెబ్ ఫిలిం చేశాను, శ్రేయాస్ ఈటీలో విడుద‌లైంది. ‌ ‘బొమ్మ అదిరింది – దిమ్మ తిరిగింది` హీరోయిన్ గా నా రెండ‌వ చిత్రం.
  • ఈ సినిమాలో నాది హౌస్ వైఫ్ క్యారెక్ట‌ర్‌. కొత్త‌గా పెళ్లి అయిన కొంత మంది స్నేహితులు క‌లిసి హాలీడే కోసం దూరంగా ఉన్న ఒక ఫాం హౌజ్‌కి వెళ్లాల‌ని ప్లాన్ చేసుకుంటారు. అక్క‌డికి వెళ్ల‌గానే స‌డ‌న్‌గా ప్ర‌భుత్వం లాక్ డౌన్ విధిస్తుంది. ఆ త‌ర్వాత ఆ ఇంట్లో వారికి కొన్ని అసాదార‌ణ సంఘ‌ట‌న‌లు ఎదుర‌వుతాయి. వాటిని అంద‌రూ క‌లిసి ఎలా ఎదుర్కొన్నారు? ఆ ఇంట్లో నుండి ఎలా బ‌య‌ట‌ప‌డ్డారు? అనేది క‌థాశం.
  • ఇది హార‌ర్ కామెడీ జోన‌ర్‌లో తెర‌కెక్కిన చిత్రం. షకలక శంకర్ నుంచి ఆడియన్స్ ఎక్సపెక్ట్ చేసే కామెడీతో పాటు మరికొన్ని థ్రిల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయి.

    *ఈ సినిమా ఒక ఇంట్లో జ‌రిగే క‌థ కాబ‌ట్టి అంద‌రం అక్క‌డే ఉండి షూటింగ్‌లో పాల్గొన్నాం. అంద‌రి క్యారెక్ట‌ర్స్ చాలా ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటాయి. పూర్త‌య్యే స‌రికి అంద‌రం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. షూటింగ్ చాలా స‌ర‌దాగా జ‌రిగింది.
  • ప్ర‌స్తుతం క‌థ మొద‌లైంది అని ఒక స‌స్పెన్స్ కామెడీ మూవీ చేస్తున్నాను. న‌టిగా పాత్ర‌కు న్యాయం చేయ‌గ‌లిగే అన్నిరకాల క్యారెక్ట‌ర్స్ చేయాల‌నుకుంటున్నాను.
  • న‌టిగా ప్ర‌తిరోజు ఎంతోకొంత నేర్చుకుంటూ న‌న్నునేను ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాను. తెలుగులో మ‌హేశ్‌బాబు నా ఫేవ‌రేట్ హీరో.
- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read