Monday, December 23, 2024
HomeMovie Newsగ్రాండ్ గా ఇండియన్ 2 ఆడియో లాంఛ్ ఈవెంట్ కు ప్లాన్..ప్రత్యేక అతిధులు వారేనా..?

గ్రాండ్ గా ఇండియన్ 2 ఆడియో లాంఛ్ ఈవెంట్ కు ప్లాన్..ప్రత్యేక అతిధులు వారేనా..?

- Advertisement -

శంకర్ – కమల్ హాసన్ కలయికలో తెరకెక్కుతున్న మూవీ భారతీయుడు 2 . 1996 లో వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా శంకర్ తెరకెక్కిస్తున్నారు. కమల్ హాసన్, మనీషా కోయిరాలా, ఊర్మిళ, సుకన్య ప్రధాన పాత్రధారులుగా నటించగా.. ఎ.ఆర్. రెహ్మాన్ సంగీత దర్శకత్వం వహించాడు. దేశంలో అవినీతికి వ్యతిరేకంగా తెరకెక్కిన ఈ మూవీ భారీ విజయం సాధించింది. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా శంకర్ తెరకెక్కిస్తుండడం తో అభిమానుల్లో , సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఈ సినిమాలో కమల్​తో పాటు ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, బ్రహ్మానందం, ఎస్‌జే సూర్య, సిద్దార్థ్‌, స‌ముద్రఖని, బాబీ సింహా, మధుబాల, కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జేయింట్స్​ బ్యానర్​పై ఉద‌య‌నిధి స్టాలిన్‌, లైకా సుభాస్కరన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నారు.ఇటీవలే మేకర్స్‌ షేర్ చేసిన గ్లింప్స్ అభిమానులను ఆకట్టుకుంది.

గత కొంత కాలంగా షూటింగ్​లో ఉన్న ఈ మూవీ, ఎట్టకేలకు ఈ ఏడాది జూన్​లో విడుదలయ్యేందుకు సంసిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ కూడా ప్రమోషనల్ ఈవెంట్స్​ను వీలైనంత త్వరగా మొదలెట్టేందుకు ప్లాన్స్ వేస్తున్నారు. అందులో భాగంగానే త్వరలో గ్రాండ్​గా ఇండియన్ 2 ఆడియో లాంఛ్​ జరగనుందని సమాచారం. సినీ వర్గాల టాక్ ప్రకారం ఈ ఈవెంట్ మే 16న జరగనుందట. చెన్నైలోని నెహ్రూ స్టేడియం వేదికగా ఈ ఆడియో లాంఛ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఈవెంట్​కు గ్లోబల్ స్టార్ రామ్​ చరణ్‌ అలాగే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని సమాచారం. ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read