Friday, May 17, 2024
HomeMovie Newsరాజమౌళి కి మరో పేరు ఉంది..? అదేంటో తెలుసా..?

రాజమౌళి కి మరో పేరు ఉంది..? అదేంటో తెలుసా..?

- Advertisement -

దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ కు వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చిన డైరెక్టర్. మగధీర , బాహుబలి సిరీస్ , ఆర్ఆర్ఆర్ మూవీస్ తో తెలుగు సినిమాలు అంటే ఈ రేంజ్ లో ఉంటాయా అనే రేంజ్ కి తీసుకెళ్లాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ తో ఓ భారీ మూవీ చేస్తున్నాడు. దీనికి సంబదించిన స్క్రిప్ట్ పనులు కూడా మొదలుపెట్టారు. అయితే రాజమౌళిని చాలామంది జక్కన్న , దర్శధీరుడు , మిస్టర్ పర్ఫెక్ట్ ఇలా పలు రకాలుగా పిలుస్తుంటారు. అయితే రాజమౌళి ని ఇంట్లో ఏమని పిలుస్తారో తెలుసా? ఇదే విషయాన్ని కీరవాణి చిన్న తనయుడు శ్రీ సింహా రివీల్ చేశారు.

“రాజమౌళిని మేము బాబా అని పిలుస్తాము. ఆయన మాకు వరుసకు బాబాయ్ అవుతారు. అందుకే మేము షార్ట్​కట్​​ గా బాబా అని పిలుస్తాము. ఆయనకు కూడా అలా పిలిస్తే చాలా ఇష్టం. నన్ను బాబా అనే పిలవండి అంటూ ఆయనే మాకు చాలా సార్లు చెప్పారు. అందుకోసమే మేమంతా ఆయన్ను బాబా అనే పిలుస్తాము” అంటూ శ్రీ సింహా తెలిపారు. ఇది విన్న ఫ్యాన్స్ జక్కన్నకు తన ఫ్యామిలీ అంటే ఎంత ప్రేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు. మేము కూడా ఇక బాబా అని పిలుస్తామని సరదాగా చెప్పుకొచ్చారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read