Movie News

IPL ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి

వరుస విజయాలతో అతి తక్కువ టైంలోనే టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి..తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. IPL మ్యాచ్ లపై ఈయన చేసిన వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానులు ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. దీంతో తాను చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాడు. సత్యదేవ్ నటించిన కృష్ణమ్మ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అనిల్ రావిపూడి హాజరయ్యారు. ఐపీఎల్ ప్రభావం టాలీవుడ్ పై గట్టిగానే పడింది. థియేటర్స్ కి ఆడియన్స్ రావడం తగ్గింది. దీనితో ఇటీవల విడుదలైన చిత్రాలకు వసూళ్లు అంతంత మాత్రమే ఉన్నాయి. ఐపీఎల్ చూడకపోతే కొంపలేమి మునిగిపోవు. సాయంత్రం వచ్చి థియేటర్స్ లో సినిమా చూడండి. ఫోన్ లో స్కోర్ చూసుకుంటే సరిపోతుంది అని అనిల్ అన్నాడు. దీనితో అనిల్ రావిపూడిపై నెటిజన్లు రివర్స్ అటాక్ మొదలు పెట్టారు

సినిమాలకంటే ఐపీఎల్ నే మేలు. ఐపీఎల్ చూడకపోతే కొంపలు మునిగిపోవు నిజమే.. మరి సినిమాలు చూడకపోతే మురిగిపోతాయా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనితో అనిల్ రావిపూడి మరో ఈవెంట్ లో తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. మే 19న డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నాం. ఆ రోజు కూడా ఐపీఎల్ మ్యాచ్ ఉంది. నేను ఇటీవల ఐపీఎల్ గురించి మాట్లాడిన మాటలు తప్పుగా కన్వే అయ్యాయి. నేను ఆ ఈవెంట్ కి వెళ్లేముందు ఓ డిస్ట్రిబ్యూటర్ ని కలిసాను. సమ్మర్ లో ఐపీఎల్ వల్ల కూడా సినిమాలు సరిగ్గా ఆడట్లేదు అని చెప్తే ఆ ఫ్లోలో మాట్లాడాను. ఐపీఎల్ చూడండి, సినిమాలు కూడా చూడండి. నేనూ ఐపీఎల్ చూస్తాను. నేను మాట్లాడింది అపార్థం చేసుకోవద్దు అని అన్నారు. మారి అనిల్ కామెంట్స్ తో క్రికెట్ ఫ్యాన్స్ శాంతిస్తారా…లేదా అనేది చూడాలి.