Movie News

కూతురి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన రజనీకాంత్

సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్‌ తాజాగా ఓ కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. ఈ ఇంట్లోకి రజనీకాంత్ అడుగుపెట్టారు. హీరో ధనుష్‌తో విడిపోయిన తర్వాత ఐశ్వర్య తన తల్లిదండ్రుల వద్దే ఉంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవలే సొంతంగా ఓ ఇంటిని కొనుగోలు చేసి అక్కడికి షిఫ్ట్‌ అయ్యింది. ఈ తరుణంలో తల్లిదండ్రులను తీసుకోని కొత్త ఇంట్లోకి వెళ్లి..కొత్త ఇంటి విశేషాలను పంచుకుంది. ఈ సందర్భంగా కూతురి ఇంటిని చూసి సూపర్‌ స్టార్‌ మురిసిపోయారు.

రజనీకాంత్‌ రియాక్షన్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఐశ్వర్య రజనీకాంత్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ధనుష్ నుంచి విడాకుల కావాలంటూ కోర్ట్ ను ఆశ్రయించారు ఐశ్వర్య. కాగా.. ఈ కేసును చెన్నై ఫ్యామిలీ కోర్టులో పెండింగ్ లో ఉంది. త్వరలోనే ఈ సమస్య కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

https://twitter.com/SDFilmyNews/status/1786310074035798312