Monday, December 23, 2024
Homeతెలుగు వార్తలు'మ‌హాస‌ముద్రం'లో హీరోయిన్‌గా అదితి రావ్ హైద‌రి

‘మ‌హాస‌ముద్రం’లో హీరోయిన్‌గా అదితి రావ్ హైద‌రి

ఒక్కో అనౌన్స్‌మెంట్‌తో ‘మ‌హాస‌ముద్రం’ చిత్రం ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని మ‌రింత‌గా పెంచుకుంటూ వ‌స్తోంది. శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్ హీరోలుగా న‌టిస్తోన్న ఈ సినిమాని ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజ‌య్ భూప‌తి డైరెక్ట్ చేస్తున్నారు.

- Advertisement -

లేటెస్ట్‌గా ఈ ఫిల్మ్‌కు సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర అనౌన్స్‌మెంట్ వ‌చ్చింది. అంద‌చందాల‌తో పాటు అభిన‌య సామ‌ర్థ్యం పుష్క‌లంగా ఉన్న తార‌గా ఇటు ప్రేక్ష‌కుల‌, అటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందుతున్న అదితి రావ్ హైద‌రి ఇందులో హీరోయిన్‌గా ఎంపిక‌య్యారు.

ప‌ర్ఫార్మెన్స్‌కు బాగా స్కోప్ ఉన్న ఆ కీల‌క పాత్ర‌కు ప‌లువురి తార‌ల పేర్ల‌ను ప‌రిశీలించాక‌, అదితి రావ్ అయితే ఆ పాత్ర‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావించారు. ఈ ప్రాజెక్టులో భాగం కావ‌డంతో అదితి రావ్ సైతం ఆనందం వ్య‌క్తం చేశారు.

ఇంటెన్స్ ల‌వ్ అండ్ యాక్ష‌న్ డ్రామా అయిన ‘మ‌హాస‌ముద్రం’ను ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు.

తారాగ‌ణం:
శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్‌, అదితి రావ్ హైద‌రి

సాంకేతిక బృందం:
ద‌ర్శ‌కుడు: అజ‌య్ భూప‌తి
నిర్మాత‌: సుంక‌ర రామ‌బ్ర‌హ్మం
బ్యాన‌ర్‌: ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read