Friday, November 29, 2024
HomeMovie Newsబన్నీకి రౌడీ బాయ్ స్పెషల్ గిఫ్ట్..

బన్నీకి రౌడీ బాయ్ స్పెషల్ గిఫ్ట్..

- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – నేషనల్ క్రాష్ రష్మిక (Allu Arjun-Rashmika) జంటగా..లెక్కల మాస్టర్ సుకుమార్ (Sukumar) డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ పుష్ప 2 (Pushpa 2). మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ గా ఉంది. కాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసారు. ఇక సినిమా రిలీజ్ సమయం దగ్గర పడుతుండడం తో బన్నీ సైతం సినిమా ప్రమోషన్ లలో బిజీ బిజీ గా గడుపుతున్నారు. ఇక సినిమా సక్సెస్ అవ్వాలంటూ అభిమానులే కాదు సినీ ప్రముఖులు సైతం కోరుకుంటూ బెస్ట్ విషెష్ అందిస్తున్నారు.

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కి రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఓ స్పెషల్ గిఫ్ట్ పంపించారు. దానికి అల్లు అర్జున్ కూడా స్పందించి విజయ్​కు థాంక్స్ చెప్పారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇంతకీ అది ఏ గిఫ్ట్ అంటే? బన్నీకి విజయ్ ఓ స్పెషల్ టీ షర్టును పంపించారు. దానికి వెనుక భాగంలో ‘రౌడీ పుష్ప’ అని రాసి ఉంది. అయితే దీన్ని విజయ్ క్లాతింగ్ బ్రాండ్ ‘రౌడీ’లో డిజైన చేయించినట్లు కనిపిస్తోంది. విజయ్ గిఫ్ట్ పంపిన ఈ టీ షర్టు ఫొటోను బన్నీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘మై స్వీట్ బ్రదర్. మీ ప్రేమకు చాలా థాంక్స్’ అని విజయ్​కు ట్యాగ్ చేస్తూ క్యాప్షన్ రాసుకొచ్చారు. అయితే దీనికి విజయ్ కూడా రిప్లై ఇచ్చారు. ‘మన సంప్రదాయం ఇలాగే కొనసాగుతోంది అన్నా’ అని విజయ్ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. సుకుమార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన పుష్ప 2 లో ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, జగపతిబాబు తదితరులు ఆయా పాత్రలు పోషించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్​పై నవీన్, రవి నిర్మించారు.

Our Traditions continue 🤗❤️ Love always anna.. https://t.co/8SnnVkaCx6 — Vijay Deverakonda (@TheDeverakonda) November 28, 2024

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read