Tuesday, December 3, 2024
HomeMovie Newsరన్​టైమ్​లోనూ పుష్ప రాజ్ దే హావ

రన్​టైమ్​లోనూ పుష్ప రాజ్ దే హావ

- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – నేషనల్ క్రాష్ రష్మిక (Allu Arjun-Rashmika) జంటగా..లెక్కల మాస్టర్ సుకుమార్ (Sukumar) డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ పుష్ప 2 (Pushpa 2). మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ గా ఉంది. కాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసారు.

ఈ సినిమా రన్​టైమ్​ను 3 గంటల 21 నిమిషాలకు లాక్​ చేసినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే ఈ సినిమా అత్యధిక నిడివిగల చిత్రాల లిస్ట్​లో చేరనుంది. ఇక తెలుగులో అత్యధిక నిడివి కలిగిన సినిమాల్లో ఫస్ట్ ప్లేస్ ‘దానవీరశూరకర్ణ’ ఉంది. నందమూరి తారక రామారావు స్వయంగా డైరెక్ట్ చేసిన ఈ చిత్రం అప్పట్లోనే బ్లాక్​బస్టర్​గా దూసుకెళ్లింది. 1977లో విడుదలైన ఈ సినిమా దాదాపు 3 గంటల 33 నిమిషాల నిడివితో వచ్చింది. ఆ తర్వాత 1963లో విడుదలైన ‘లవకుశ’ రన్‌టైమ్‌ 3: 28 గంటలు. ఇది కూడా సీనియర్ ఎన్​టీఆర్​దే కావడం విశేషం. అయితే ఇప్పుడు ‘పుష్ప 2 ది రూల్’ ఈ తర్వాతి స్థానంలోకి రానుంది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read