Tuesday, December 24, 2024
HomeMovie Newsవరుణ్ సందేశ్ 'నింద '

వరుణ్ సందేశ్ ‘నింద ‘

- Advertisement -

హ్యాపీడేస్ మూవీ తో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన వరుణ్ సందేశ్ ..ఫస్ట్ మూవీ తోనే ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత కొత్త బంగారులోకం తో ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించాడు. ఏమైందీ ఈవేళ అంటూ యూత్ ఆడియెన్స్‌కు మరింత దగ్గరయ్యాడు. అయితే తరువాత వరుణ్ సందేశ్ బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్‌ను నమోదు చేయలేకపోయాడు. మధ్యలో అమెరికాకు వెళ్లి సెటిల్ అయ్యాడు. ఆ టైంలోనే సినిమాలకు పూర్తిగా దూరమయ్యాడు. మళ్లీ బిగ్ బాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ప్రస్తుతం మళ్లీ సినిమాల ఫై ఫోకస్ పెట్టిన వరుణ్..తాజాగా నింద మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

యదార్థ ఘటనల ఆధారంగా ఈ మూవీ రాబోతోందని తెలుస్తోంది. కాండ్రకోట మిస్టరీ నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందట. ఈ చిత్రాన్ని రాజేష్ జగన్నాథం నిర్మించడమే కాకుండా కథ, కథనాన్ని రాసి దర్శకత్వం వహించాడట. ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మించిన ఈ మూవీపై ఇప్పటికే మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఇది వరకు వదిలిన టైటిల్ లోగో, పోస్టర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో రాబోతోన్న ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. మే 15న ఈ చిత్రం నుంచి టీజర్‌ను కూడా విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read