త్రిష..కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. చిత్రసీమలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఛాన్సులు రాబట్టుకుంటూ అలరిస్తున్న ఏకైక బ్యూటీ ఈమె అనే చెప్పాలి. సిమ్రన్ ‘జోడి’ మూవీ తో చిత్రసీమలోకి అడుగుపట్టిన ఈ చిన్నది.. ఆ తర్వాత పలు తమిళ చిత్రాల్లో నటించింది. నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ప్రభాస్ వర్షం ఆమె కెరీర్‌కు బ్రేక్ ఇచ్చింది. ఈ మూవీ తో యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది. ఆతర్వాత చేసిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, అల్లరి బుల్లోడు, పౌర్ణమి, సైనికుడు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, కృష్ణ, బుజ్జిగాడు ఇలా ఎన్నో చిత్రాలు సక్సెస్ అవ్వడం తో అమ్మడు టాప్ ప్లేస్ కు వెళ్ళింది.
కెరియర్ పిక్ స్టేజ్ లో ఉన్నప్పుడు.. కొంత కాలం తెలుగు సినిమాలకు దూరమైంది. ఈ మధ్యనే పొన్నియిన్ సెల్వన్‌తో రీ ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకుంది. రోడ్, లియో, రాంగి వంటి చిత్రాల్లోనూ నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాల వరకు ఉన్నాయి. వీటిలో చిరంజీవి విశ్వంభర సినిమా ఒకటి. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఈమె పెళ్లి ఫై స్పందించింది. గతంలో ఓ బిజినెస్ మాన్ తో ఎగేజ్మెంట్ అయినప్పటికీ..ఆ తర్వాత పెళ్లి వరకు వెళ్లకుండా రద్దయింది. అయినప్పటికీ అమ్మడు మాత్రం ప్రేమ పెళ్లే చేసుకుంటా అని తెలిపింది.