Tuesday, December 24, 2024
HomeMovie Newsహరీష్ డైరెక్షన్లో రామ్..

హరీష్ డైరెక్షన్లో రామ్..

- Advertisement -

హీరో రామ్ – హరీష్ శంకర్ కలయికలో ఓ మూవీ సెట్స్ పైకి రాబోతున్నట్లు తెలుస్తుంది. గత కొంతకాలముగా రామ్ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. 2019లో పూరి జగన్నాథ్‌తో చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఇప్పటివరకూ రామ్‌కి ఒక్క హిట్ దక్కలేదు. ఆ తర్వాత చేసిన రెడ్, ది వారియర్, స్కంద చిత్రాలు ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయాయి. ముఖ్యంగా డైరెక్టర్ బోయపాటి శీనుతో చేసిన స్కంద సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు రామ్.

కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులతో సినిమాను గట్టిగానే పైకి లేపే ప్రయత్నం చేశాడు డైరెక్టర్.. కానీ ఆడియన్స్ మాత్రం నిరాశ చెందారు. ప్రస్తుతం పూరి డైరెక్షన్లో డబుల్ ఇస్మార్ట్ మూవీ చేస్తున్నాడు రామ్. ఈ మూవీ కూడా అనేక ఆర్ధిక సమస్యలతో షూటింగ్ కు బ్రేక్ పడింది. రీసెంట్ గా ముంబై లో ఈ మూవీ షూటింగ్ మొదలుపెట్టారు. ఈ సినిమా సెట్స్ ఫై ఉండగానే..హరీష్ ఓ కథ ను రామ్ కు వినిపించాడట. ఆ కథ బాగా నచ్చడం తో వెంటనే ఓకే చేసాడట. పూరి మూవీ పూర్తి కాగానే ఈ మూవీ ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారట. మరి ఈ సినిమా విశేషాలు ఏంటి అనేది మరికొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read