Tuesday, December 24, 2024
HomeMovie Newsపుష్ప 2 నుండి రెండో సాంగ్ వచ్చేస్తుంది..

పుష్ప 2 నుండి రెండో సాంగ్ వచ్చేస్తుంది..

- Advertisement -

ఇప్పటికే పుష్ప-2 నుండి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ వచ్చి అందర్నీ ఆకట్టుకోగా..ఇప్పుడు రెండో సాంగ్ రాబోతుంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో చెప్పాలిన పనిలేదు. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. అల్లు అర్జున్ నటనకు ఏకంగా జాతీయ అవార్డు లాభించింది. అంతే కాదు బన్నీ క్రేజ్ ఈ సినిమా తర్వాత బీభత్సంగా పెరిగింది. ఎక్కడ చూసిన అల్లు అర్జున్ పేరే వినిపిస్తుంది.. పుష్ప డైలాగ్సే మారుమ్రోగుతున్నాయి. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతుంది.? కథలో ఎలాంటి ట్విస్ట్ లు ఉంటాయి.? అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే విధంగా సినిమా సాంగ్స్ ఫై కూడా అంతే విధంగా ఎదురుచూస్తున్నారు.

రీసెంట్ గా పుష్ప 2 లోని ఫస్ట్ సాంగ్ వచ్చి ఆకట్టుకుంది. లిరిసిస్ట్ చంద్రబోస్ రాసిన ఈ పాట అద్భుతంగా ఉంది. పుష్ప 2లో హీరో పాత్ర ఎలా ఉంటుందనే దానిపై ఈ పాటతో ఓ క్లారిటీ వచ్చేసింది. పుష్పలో టైటిల్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అదే రేంజ్‌లో పుష్ప 2 ఫస్ట్ సింగిల్‌ను ప్లాన్ చేశారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ కూడా చాలా క్యాచీగా ఉంది.

ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగానే ఈ మూవీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు తమ ట్విట్టర్ ఖాతాలో అదిరిపోయే ట్వీట్ పెట్టారు. ”రేపు ఉదయం 11.07” గంటలకు అప్డేట్ ఇవ్వబోతున్నామని తెలిపారు. అయితే ఈ ట్వీట్ నిన్న (మంగళవారం మే 21) పెట్టారు. అంతేకాకుండా అందులో ఓ సింబల్‌తో క్లారిటీ ఇచ్చేశారు. రెండు వేళ్లతో పక్కనే మ్యూజిక్ సింబల్‌ను పెట్టారు. దీంతో అందరికీ అర్థమైపోయింది. అది రెండో పాట అప్డేట్ అని. దీంతో ఈ రోజు 11.07 గంటలకు ఆ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

బన్నీ, రష్మిక, ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్.. లాంటి స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుందని గతంలోనే ప్రకటించారు. పుష్ప తో నేషనల్ అవార్డు, కోట్ల కలెక్షన్స్, పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్న అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో ఇంకే రేంజ్ కి ఎదుగుతాడో చూడాలి.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read