Tuesday, December 24, 2024
HomeMovie Newsముగ్గురు భామలతో ప్రభాస్ ఆట పాట..

ముగ్గురు భామలతో ప్రభాస్ ఆట పాట..

- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో ది రాజా సాబ్ మూవీ ఒకటి. ప్రభాస్, మారుతి కాంబినేషన్​లో రానున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. కాగా ఈ చిత్రం తాలూకా ఓ అప్డేట్ అభిమానుల్లో సంతోషం నింపుతుంది. ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్​లో ప్రభాస్​ ముగ్గురు హీరోయిన్లతో కలిసి స్టెప్పులేయనున్నారట. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్​తో చిత్రీకరించనున్న ఆ పాటలో ప్రభాసే హైలైట్​గా నిలవనున్నారని టాక్ నడుస్తోంది.

దీని కోసమని మేకర్స్ భారీ ప్లాన్​ చేస్తున్నారని సమాచారం. హారర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్​తో పాటు నిధి అగర్వాల్‌, మాళవిక మోహన్, రిద్ది కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్​పై ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read