Thursday, December 26, 2024
HomeMovie News' కన్నప్ప ' ఫ్రీగా చేస్తున్నాడా ..?

‘ కన్నప్ప ‘ ఫ్రీగా చేస్తున్నాడా ..?

- Advertisement -

మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మ్కంగా చేస్తున్న చిత్రం కన్నప్ప. ఈ మూవీ లో బాలీవుడ్ నటి నటులతో పాటు అగ్ర హీరోలు నటిస్తుండడం తో ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అలాంటి ఈ మూవీ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఆ పాత్ర తాలూకా సన్నివేశాల షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. కాగా ఈ పాత్ర కోసం ప్రభాస్ ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదని సమాచారం.

మోహ‌న్ బాబుపై త‌న‌కున్న గౌర‌వం, ఇష్టంతో ఈ సినిమాని ఫ్రీగా చేసిన‌ట్టు తెలుస్తోంది. మోహ‌న్‌బాబుతో ప్ర‌భాస్‌కు మంచి అనుబంధం ఉంది. ‘బుజ్జిగాడు’లో ఇద్ద‌రూ క‌లిసి న‌టించారు. అప్ప‌టి నుంచీ.. వీరి మైత్రి బ‌ల‌ప‌డింది. మోహ‌న్ బాబు కోరిక మేర‌కు ఈ సినిమాలో న‌టించ‌డానికి ప్ర‌భాస్ ముందుకొచ్చాడు. అన్నింటికంటే ముఖ్యంగా పెద‌నాన్న కృష్ణంరాజుకు ‘క‌న్న‌ప్ప‌’ ఇష్ట‌మైన స‌బ్జెక్ట్. ప్ర‌భాస్ తో ‘భ‌క్త కన్న‌ప్ప‌’ రీమేక్ చేద్దామ‌నుకొన్నారు. కానీ కుద‌ర్లేదు. పెద‌నాన్న కోరిక‌ని కొంత వ‌ర‌కూ ఈ సినిమాతో నెర‌వేర్చే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు ప్రభాస్.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read