Movie News

స్టైలీష్ కాప్​గా నాగ్..

కింగ్ నాగార్జున గత కొంతకాలంగా సరైన హిట్ లేకుండా గడుపుతున్నాడు..విభిన్న కథలతో ప్రేక్షకులముందుకు వచ్చినప్పటికీ అవేవి కూడా ఫ్యాన్స్ ను ఆకట్టుకోలేకపోతున్నాయి. దీంతో ఫ్యాన్స్ అంత నాగ్ నుండి ఓ హిట్ పడితే బాగుండని కోరుకుంటున్నారు. ఈ తరుణంలో శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘కుబేరా’ సినిమాలో నాగ్ ఓ ప్రత్యేక రోల్ చేస్తున్నట్లు సమాచారం.

తమిళ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీ లో నాగార్జున పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందనీ, శేఖర్ కమ్ముల నాగ్ ను సరికొత్త కోణంలో చూపించనున్నారని ఫిలిం నగర్ వర్గాలు అంటున్నాయి. తాజా సమాచారం ప్రకారం “కుబేరా”లో నాగార్జున మరోసారి పోలీస్ ఆఫీసర్​గా కనిపించనున్నారని తెలుస్తోంది. స్టైలీష్ కాప్​గా కనిపించనున్నారని అంతా అంటున్నారు. అయితే ఇందులో నాగ్ పాజిటివ్ రోల్​లో కనిపిస్తారా లేదా నెగిటివ్ రోల్​లోనా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో అరణ్య కాండ, శాంతి క్రాంతి, నిర్ణయం, రక్షణ, ఆవిడా మా ఆవిడే, శివమణి, గగనం, ఆఫీసర్, వైల్డ్ డాగ్ లాంటి సినిమాల్లో నాగార్జున పోలీస్ గెటప్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మరోసారి నాగ్ అలాంటి రోల్ చేయబోతున్నాడు.

ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మునుపెన్నడూ కనిపించని అద్భుతమైన లోకేషన్లు చూపించనున్నారట డైరెక్టర్ శేఖర్ కమ్ముల. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతుండగా నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూసుకుంటున్నారు. రష్మిక హీరోయిన్​గా నటిస్తోంది.