Movie News

వైరల్ గా మారిన పుష్ప నటుడి వ్యాఖ్యలు

ఫహాద్​ ఫాజిల్..ఇప్పుడు ఈయన పేరు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. పుష్ప మూవీ లో పోలీస్ ఆఫీసర్ రోల్ లో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇక పుష్ప 2 లో ఏ రేంజ్ లో తన నటనతో అదరగొట్టాడో అని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈయన ఆవేశం మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడం తో సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ తరుణంలో ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఇంతకీ ఈయన ఏమన్నారంటే..

“జీవితంలో సినిమాల కంటే ముఖ్యమైనవి చాలా ఉన్నాయని చెప్పారు ఫాజిల్. ‘నేను ఎప్పుడూ నా ఫ్యాన్స్‌కు ఓ విషయం చెబుతాను. వారిపై నాకున్న కమిట్‌మెంట్‌ ఎంతవరకంటే, సినిమా చూడగలిగేలా తీసేందుకు ప్రయత్నిస్తాను. అంతకు మించి వారు నా గురించి ఆలోచించాలని నేను కోరుకోను. నా జీవితంతో నేను ఏం చేస్తున్నాను? వంటి విషయాలు అనవసరం. మీరు సినిమా చూసి థియేటర్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత నన్ను సీరియస్‌గా తీసుకోకండి. మీరు థియేటర్లలో ఉన్నప్పుడు మాత్రమే నా గురించి ఆలోచించండి. యాక్టర్‌లు, పెర్ఫార్మెన్స్‌లు గురించి డైనింగ్ టేబుల్‌ దగ్గర డిస్కషన్‌లు పెట్టకండి. థియేటర్‌లో లేదా ఇంటికి తిరిగి వెళ్లే మార్గంలో మాత్రమే మాట్లాడండి. అంతకు మించి సినిమాకు మీ జీవితంలో ప్రాధాన్యం ఇవ్వద్దు. సినిమా చూడటం కంటే మీ జీవితంలో మీరు చేయాల్సింది చాలా ఉంది.” అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై పలువురు రకరకాలుగా స్పందిస్తున్నారు.