తెలుగు వార్తలు

ఇస్మార్ట్ గణేషుడి ని తయారు చేసిన నభా నటేష్

యువ కథానాయిక నభా నటేష్ లంబోదరుడికి వినూత్నంగా స్వాగతం పలికింది. గణేశ్ చతుర్థిని పురస్కరించుకొని తన నివాస ప్రాంగణంలో రకరకాల పుష్పాలతో వినాయకుడి రూపాన్ని అలకరించిన నభా… బొజ్జ గణపయ్య పట్ల ప్రత్యేక భక్తిని చాటుకుంది. అంతేకాకుండా అందంగా అలకరించిన పుష్ప గణనాథుడితో సెల్ఫీ వీడియో తీసుకొని మురిసిపోయింది. నభా చేసిన వినాయకుడు వెరైటీ గా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేసి మెచ్చుకుంటున్నారు.