Movie News

సీతాదేవిగా సాయి పల్లవి భలేగా ఉందే..

ఫిదా తో అందర్నీ ఫిదా చేసిన సాయి పల్లవి..మొదటి నుండి అందరి హీరోయిన్ల మాదిరి గ్లామర్ పాత్రలకు ఓకే చెప్పకుండా ప్రాముఖ్యత ఉన్న పాత్రలకే ఓకే చెపుతూ వస్తుంది. అందుకే అమ్మడు అందరి కంటే వెనుకపడి ఉంది. సోషల్ మీడియా లో పెద్దగా యాక్టివ్ గా లేనప్పటికీ, సినిమాలు పెద్దగా చేయనప్పటికీ అమ్మడి క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ‘రామాయణ్’ మూవీ లో సీతాదేవి పాత్రలో నటిస్తుంది. రణబీర్ కపూర్ రాముడి గా నటిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో నితీశ్‌ తివారీ తెరకెక్కిస్తున్నాడు.

ఇప్పటీకే ఈ చిత్రం తాలూకా విశేషాలు సినిమాపై ఆసక్తి పెంచేస్తుండగా..తాజాగా చిత్రంలోని హీరో – హీరోయిన్ తాలూకా పిక్స్ బయటకు వచ్చి ఒక్కసారిగా వార్తల్లో నిలిచేలా చేసాయి. అయితే ఈ సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నారట. ఇందులో రావణుడిగా ‘కేజీఎఫ్’ ఫేమ్ యష్ కనిపించనున్నారు. లీక్ అయినా పిక్స్ లో రణబీర్ రాముడిగా , సాయి పల్లవి సీతగా కనిపించింది.