సినిమా వార్తలు

ఫీల్ గుడ్ మ్యూజికల్ లవ్ స్టోరీగా రాబోతున్న ‘మరువ తరమా’ టైటిల్ లోగో విడుదల

ప్రేమ కథలకు ఎప్పుడూ జనాలు ఓటు వేస్తూనే ఉంటారు. మంచి ప్రేమ కథలు ఇప్పుడు అరుదుగా వస్తున్నాయి. ఇలాంటి తరుణంలోనే ఫీల్ గుడ్ మ్యూజికల్ లవ్ స్టోరీ రాబోతోంది. హరీష్‌ ధనుంజయ్ హీరోగా, అతుల్యా చంద్ర, అవంతిక నల్వా హీరోయిన్లుగా ‘మరువ తరమా’ అనే చిత్రం రాబోతోంది. సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్ మీద గిడుటూరి రమణ మూర్తి, రుద్రరాజు విజయ్ కుమార్ రాజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వం వహించారు.

ఈ కొత్త ఏడాదిలో ప్రేమను నింపేందుకు మరువ తరమా అనే చిత్రం రాబోతోందని మేకర్లు తెలిపారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న యూనిట్.. పోస్ట్ ప్రొడక్షన్‌ పనులతో బిజీగా ఉంది. కొత్త సంవత్సరం ప్రారంభంలో ఈ మూవీ టైటిల్ లోగోను విడుదల చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తోంది.

బీచ్‌లో హీరోహీరోయిన్ల రొమాంటిక్ పోజ్ అందరినీ మెప్పించేలా ఉంది. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీని, మిగతా వివరాలను ప్రకటించనున్నట్టు మేకర్లు తెలిపారు.

ఈ చిత్రానికి విజయ్ బుల్గనిన్ సంగీతాన్ని అందించారు. శ్రీ సాయి కెమెరామెన్‌గా, కె.ఎస్.ఆర్ ఎడిటర్‌గా వ్యవహరించారు.

నటీనటులు : హరీష్‌ ధనుంజయ్, అతుల్యా చంద్ర, అవంతిక నల్వా

సాంకేతిక బృందం

నిర్మాతలు : గిడుటూరి రమణ మూర్తి, రుద్రరాజు విజయ్ కుమార్ రాజు
బ్యానర్ : సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్
దర్శకత్వం : చైతన్య వర్మ నడింపల్లి
ఎడిటర్ : కె.ఎస్.ఆర్
కెమెరామెన్ : శ్రీ సాయి
సంగీతం : విజయ్ బుల్గనిన్
కొరియోగ్రఫర్ : అజయ్ శివ శంకర్
పీఆర్వో : సాయి సతీష్, పర్వతనేని రాంబాబు