చిత్రసీమ అనేది రంగుల ప్రపంచం..ఎవరి జాతకం ఎప్పుడు మారుతుందో చెప్పలేం..ఒక్క సినిమాతో స్టార్ అయిపోయిన వారు ఉన్నారు..ఒక్క సినిమాతో అసలు అవకాశాలు లేనివారు కూడా ఉన్నారు. అందుకే ఉన్న నాల్గు రోజులు నాల్గు రాళ్లు వెనకేసుకోవాలని అంత చెపుతుంటారు. ఒకప్పుడు అగ్ర స్టార్ గా ఎంతో బిజీగా ఉన్న నటులు..ఇప్పుడు తినేందుకు తిండి కూడా లేక ఇబ్బంది పడేవారు కూడా ఉన్నారు. తాజాగా ఓ స్టార్ కమెడియన్ పిక్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారుతుంది.
సౌత్ ఇండస్ట్రీలో 200 పైగా సినిమాల్లో నటించాడు. తెలుగులోనూ అనేక చిత్రాల్లో అలరించాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. మొదట్లో డైరెక్టర్ భారతీరాజా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. అలా భారతీరాజా సినిమాలో చిన్న చిన్న పాత్రలలో చాల ఫెమస్ అయ్యాడు. ఇప్పుడు అస్సలు గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. అయినవెరో కాదు జనగరాజ్. తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో కలిపి మొత్తం 240కిపైగా చిత్రాల్లో నటించిన ఆయన తెలుగులో చివరిగా ‘దాడి’ సినిమాలో నటించారు. ఆ తర్వాత తమిళంలో ఎందరో స్టార్ హీరో సినిమాలు, సహాయ పాత్రలు చేశారు. ఆ తర్వాత క్రమంగా ఆఫర్స్ తగ్గడంతో సినిమాలకు దూరమయ్యారు.
లాంగ్ గ్యాప్ తర్వాత విజయ్ సేతపుతి, త్రిషల ’96’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఆ మధ్య జనగరాజ్ మూవీస్‌కి బై చెప్పి అమెరికా వెళ్లిపోయారంటూ వార్తలు వచ్చాయి. కానీ అవన్ని ఉట్టి పుకార్లేనని ఆయనే స్వయంగా ఓ ఇంటర్య్వూలో వెల్లడించారు. ప్రస్తుతం ఆఫర్స్ లేక సినిమాలకు దూరమైన ఆయన తాత అనే షార్ట్ ఫిలింలో నటించారు. ప్రస్తుతం 68 ఏళ్ల వయసు ఉన్న ఆయన ముఖంలో వృద్ధాప్య ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జనగరాజ్ను ఇలా చూసి ఫ్యాన్స్, ఆడియన్స్ అంతా అవాక్క్ అవుతున్నారు. మరి ఇంతలా మారిపోయారేంటి? అంటూ నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారంటూ అంతా ఆరా తీస్తున్నారు. మరి ఆయనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.